Vladimir Putin: ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో రష్యాపై దాడులను ఉక్రెయిన్ తీవ్రతరం చేసింది. కాగా, రష్యాపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు పలు దేశాలు సహాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో దేశాలకు వ్లాదిమీర్ పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం అనేక సమస్యలలో పాలుపంచుకుంది. ఆ దేశాల్లో నిరంతరం ఉద్రిక్తతలను తగ్గించడంలో నిమగ్నమై ఉంది. ఇజ్రాయెల్‌పై రష్యా అణు దాడిని ప్రధాని నరేంద్ర మోడీ నివారించారా? అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమాధానమిచ్చారు.
North Korea: నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా లేదా దాని మిత్ర రాజ్యాలపై అణుదాడి జరిగితే అది ఆమోదయోగ్యం కాదని, ఈ పరిణామాలు కిమ్ పాలనకు ముగింపు పలుకుతాయని అమెరికా-దక్షిణ కొరియా ఒక సంయుక్త ప్రకటనలో శనివారం తెలిపాయి.
ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడికి రష్యా సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రష్యా సిద్ధం చేసుకుంటోంది. అణ్వాయుధాలను మోహరించడానికి బెలారస్ దేశంతో చర్చలు జరిపి అంగీకరింప చేసుకుంది.