ఆ ఎమ్మెల్యే ఏదో…… గొప్పగా…… సెటైరికల్‌గా మాట్లాడదామనుకుంటే….. చివరికి సుర్రు సుమ్మైపోయిందా? మాటలు మిస్ ఫైర్ అయిపోయి అట్రాసిటీ కేసు పెట్టించుకునేదాకా వెళ్ళాయా? ఫైనల్‌గా జంక్షన్ జామైపోయే పరిస్థితులు వచ్చాయా? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడ మాటలు బూమరాంగ్ అయ్యాయి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలోని వ్యవహారాలు ఆయన మీద అట్రాసిటీ కేసు బుక్ చేసేదాకా వెళ్లాయట. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌ని ఉద్దేశించి…
ఇటుక అన్న మాట వినిపిస్తే చాలు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉలిక్కి పడుతున్నారట. కలలో ఇటుకలు కనిపించినా….భయంతో ఒళ్ళంతా తడిసిపోతోందట. ఇక అసలు ఇటుక బట్టీ అన్న మాట వింటే చాలు శివాలెత్తిపోతున్నట్టు సమాచారం. అసలేంటా ఇటుక పంచాయితీ? అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఇటుక ఫోబియా ఎందుకు పట్టుకుంది? నిజామాబాద్ జిల్లాలో ఓ కాంగ్రెస్ శాసనసభ్యుడికి ఇటుక బట్టీల ఎమ్మెల్యేగా పేరు పెట్టారట బీజేపీ లీడర్స్. ఇటుక బట్టీల ఎమ్మెల్యేకు స్వాగతం అంటూ.. ప్లెక్సీలు సైతం ఏర్పాటు…
ఆ టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర అసహనంగా ఉన్నారా? గెలిచి 9నెలలవుతున్నా…. ఏం చేయలేకపోతున్నానని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? చివరికి తప్పు చేసిన వారిని శిక్షించలేకపోయానన్న బాధ ఆయనలో పెరిగిపోతోందా? అసలాయన ఏమన్నారు? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి? ఎవరా శాసనసభ్యుడు? గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు…2019లో వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేసి అప్పటి తన ప్రత్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. ఇక 2024లో వైసీపీని వీడి టీడీపీ బీఫాం మీద పోటీ…
లోకేష్ వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం: పాఠశాలల హేతుబద్ధీకరణపై సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుధం కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా వెనుకబడి పోయాయని, ‘నాడు-నేడు’ పేరుతో విద్యా వ్యవస్థను పతనావస్థకు చేర్చారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించిన మంత్రి లోకేష్ అన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం…
నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఇవాళ 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు సీఐడీ కోర్టులో విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేశారు. గన్నవరంలో నేడు మంత్రి…
కేర్ హాస్పిటల్స్ సంచలనం: అత్యాధునిక కార్డియాక్ కేర్‌తో క్రిటికల్‌గా ఉన్న రోగికి కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను రక్షించింది. హైదరాబాద్‌లో గుండె పోటుతో బాధపడుతున్న 68 ఏళ్ల శ్రీమతి సుభాషిణి (పేరు మార్పు)కు విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసు, అధునాతన కార్డియాక్ కేర్, వినూత్నమైన సాంకేతికతలు, మరియు మల్టీడిసిప్లినరీ విధానంతో ఎలా ప్రాణాలను రక్షించగలమో నిరూపించింది. రుమటాయిడ్ ఆర్థ్రిటిస్, ఇంటర్‌స్టిషియల్ లంగ్ డిసీజ్, కాలేజెన్…
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు: నేడు దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30కు విజయవాడ నుంచి ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. సాయంత్రం 6.30కి సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈరోజు రాత్రికి ఇద్దరు ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర…
నేడు అన్నవరానికి కలెక్టర్ షాన్ మోహన్ వెళ్లనున్నారు. ఆలయంలో జరుగుతున్న సంఘటనలు, ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ బౌతిక ఖాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2023-24 ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ 28వ వార్షిక నివేదికను మంత్రి బీసీ జనార్దన్…
ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టా: జాతీయ ఉపాధి హామీ పథకంపై తాను ప్రత్యేక దృష్టి పెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని, రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, అవినీతి కి పాల్పడ్డ కొంతమందిని సస్పెండ్ చేశామన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం…