పార్టీకి బలం ఉన్నచోట… కేడర్ ఉంటే చాలు లీడర్స్‌తో పనేముందని జనసేన అధిష్టానం భావిస్తోందా? సైనిక బలగం ఎంతున్నా… నడిపే దళపతి ఒకడు ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించిందా? అందుకే తనకు పట్టున్న ఆ ఉమ్మడి జిల్లాలో ఇన్‌ఛార్జ్‌ల నియామకాన్ని విస్మరించిందా? ఓవైపు లీడర్స్ కొరతతో సతమతం అవుతూ మరోవైపు ఉన్నవాళ్లని వరుసబెట్టి సస్పెండ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన వ్యవహారం గందరగోళంగా మారుతోంది. మొత్తం 19…
అంతా డాడీనే చూసుకుంటారా? పనులకు పర్మిషన్స్ ఇవ్వాలన్నా, అధికారిక సమీక్షలు చేయాలన్నా… అన్నీ ఆయనేనా? తనకు ప్రత్యేకంగా ఏ హోదా లేకున్నా… మంత్రిగారి ఫాదర్ హోదాలో మొత్తం చక్కబెట్టేస్తున్నారా? ఇప్పటికీ నా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయి డాడీ… అన్నది సినిమా డైలాగ్ అయితే… నియోజకవర్గాన్ని మీ చేతుల్లో పెడుతున్నా డాడీ అన్నది ఆ మంత్రిగారి డైలాగ్ అట. ఎవరా మినిస్టర్? ఏంటా కథ? వాసంశెట్టి సుభాష్…. ఏపీ కార్మిక శాఖ మంత్రి.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు…
జనసేన ఎమ్మెల్యేలకు ఇప్పుడు తత్వం బోథపడిందా? ఏడాదిగా ఎక్కడున్నారో… ఏం చేస్తున్నారో కూడా తెలియని వాళ్ళు సైతం ఇప్పుడు నియోజకవర్గాల బాటపట్టి… మేం పక్కా లోకల్ అంటున్నారా? ఉన్నట్టుండి అంత మార్పు ఎలా వచ్చింది? ఉలిక్కిపడి లేచినట్టు… వాళ్లంతా ఒక్కసారిగా ఎందుకు అలర్ట్ అయ్యారు? వాళ్ళని అలా పరుగులు పెట్టిస్తున్న అంశమేది? 2024 ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలిచాక…ఆ ఊపుతో ముందుకెళ్లాల్సిన జనసేన నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో పత్తా లేకుండా పోతున్నారట. పార్టీ కార్యక్రమాలను పక్కనబెట్టి…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అందుకే నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగవేయాలన్న ప్లానింగ్‌లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును ఎలాగైనా కొట్టాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తుంటే..
అక్కడ మామ పొలిటికల్ జర్నీకి అల్లుడు మోకాలడ్డుతున్నాడా? లేక అల్లుడికి చెక్ పెట్టేందుకు మామ కామ్‌గా పావులు కదుపుతున్నాడా? సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని రెండు పక్షాల అనుచరులు రక్తి కట్టిస్తున్నారా? గత ఎన్నికల్లో అల్లుడి చేతిలో ఓడిన ఆ మామ ఎవరు? ఇద్దరి మధ్య సోషల్ యుద్ధంలో బయటికి వస్తున్న కొత్త విషయాలేంటి? పల్నాడు జిల్లా పెదకూరపాడు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున భాష్యం ప్రవీణ్, వైసీపీ నుంచి నంబూరు…
కాంగ్రెస్ కంచుకోటలో తేడా రాజకీయం నడుస్తోందా? పార్టీ కోసం చెమటోడ్చిన వాళ్ళని కాదని ఎవరెవరికో పదవులు ఇస్తున్నారన్న అసంతృప్త స్వరాలు పెరుగుతున్నాయా? ఇన్నాళ్ళు లోలోపల రగిలిపోతున్న వాళ్ళు ఇక ఓపెన్ అవుతున్నారా? ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా అసంతృప్త నేతలు? కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం. ఆ బలంతోనే…. 2014 ఎన్నికల్లో కేవలం 11 రోజుల ముందు ములుగు నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు…
ఆ వైసీపీ నాయకుడు తూర్పుకు తిరిగి దండం పెట్టేశారా? రాజకీయం చేయడం ఇక నావల్ల కాదు బాబోయ్… అంటూ దండం పెట్టేశారా? ఒకప్పుడు తోపు అనుకున్న ఆ లీడర్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో… పార్టీ కూడా లైట్ తీసుకుందా? పొరుగింటి పుల్లకూర మనకు వర్కౌట్ కాదని డిసైడై… లోకల్ రాగం పాడుతోందా? ఏదా నియోజకవర్గం? సైలెంట్‌గా సైడైపోయిన ఆ నాయకుడెవరు? ఆవిర్భావం నుంచి వైసీపీ అధిష్టానానికి తీరని కల… విశాఖ నగరంలో జెండా ఎగరేయడం. సిటీలోని నాలుగు…
ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడు మూడ్ నుంచి బయటికి రాలేకపోతోందా? వరుసగా మూడు ఎన్నికల నుంచి మూడో స్థానానికే పరిమితం అయి పడుతూ.. లేస్తున్న చోట ఇప్పుడు మూడు ముక్కలాట మొదలైందా? ఇన్ఛాలేని చోట మాకంటే… మాక్కావాలంటూ… నేతలు పావులు కదుపుతున్నారా? అంగట్లో అన్నీ ఉన్నా…. అన్న సామెతని గుర్తు చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరా మూడు ముక్కలాట ప్లేయర్స్? కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం…. 2004 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం దక్కలేదు.…