తెలంగాణ కాంగ్రెస్ మారిపోయిందా? నాయకుల్లో పరిణితి పెరిగిపోయిందా? చిన్న ఛాన్స్ దొరికితే చాలు చెలరేగిపోయి అవతలోళ్ళని ఆడేసుకుందామని ఆరాటపడే నాయకుల్లో కూడా మార్పు వచ్చిందా? ఇంతకీ ఈ పరిణితి చర్చలు ఇప్పుడెందుకు కొత్తగా జరుగుతున్నాయి? ఏ విషయంలో మార్పు కనిపిస్తోంది? తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పు మొదలైనట్టు కనిపిస్తోంది. సందర్భం దొరికితే చాలు…. తమకు అనుకూలంగా వాడేయడం కాంగ్రెస్ పార్టీలో కామన్. కానీ… ఇప్పుడు మాత్రం వాతావరణం దానికి భిన్నంగా నడుస్తోందట. నాయకులంతా మారిపోయారా లేదంటే పార్టీ డీఎన్ఏలోనే…
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ తీరుతో అధికార పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారా? ఎంతటి అధికారి అయినాసరే… అదేదో తమ ఇంట్లో పాలేరన్నట్టుగా ఛైర్మన్ ఫీలైపోతున్నారా? జిల్లా స్థాయి అధికారుల మీదికి సైతం ఒంటికాలి మీద లేస్తూ… బూతు పురాణం అందుకోవడాన్ని ఎలా చూడాలి? ఓవైపు రచ్చ అవుతున్నా… అంతా జనం కోసమేనని ప్రభాకర్‌రెడ్డి చెప్పడం దేనికి సంకేతం? ఓపెన్ విత్ స్పాట్ జేసీ అధికారుల మీద ఫైర్ అవుతున్నది ఇదే… ఈ వైఖరే… ఇప్పుడు కేవలం…
ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉందనుకుంటారు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటిమీద వాలడానికి వీల్లేదన్నట్టుగా ఉంటాయి రెండు పార్టీల నాయకుల స్టేట్మెంట్స్. అలాంటి రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇద్దరి ఫోటోలు ఒకే ఫ్లెక్సీలో ఎందుకు కనిపించాయి? ఇద్దరూ కలిసి లంచ్ మీటింగ్‌కు ఎందుకు అటెండ్ అయ్యారు? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఎవరు వాళ్ళు ఇద్దరూ? ప్రీతి రెడ్డి…. అలా చెబితే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు గానీ… మాజీ…
రస్తుం మైన్స్ పార్ట్ టూ స్టార్ట్ అయిందా? క్లైమాక్స్ దిశగా పోలీసుల అడుగులు పడుతున్నాయా? మరో మాజీ మంత్రి కోసం పోలీస్ స్కెచ్ రెడీ అయిందా? ఇక ఏ క్షణాన్నయినా అరెస్ట్ వార్త వినే అవకాశం ఉందా? ఏంటా పార్ట్ టూ? ఎవరా మాజీ మంత్రి? నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. తెల్లరాళ్ళు ఎగిరి ఎటెటో తిరిగి… ఇప్పుడు అంతా ఊహిస్తున్న వైపే పడుతున్నాయట. మైనింగ్ బ్లాస్ట్‌కు ఎగిరొచ్చి పడుతున్న క్వార్ట్జ్…
ఆ నియోజకవర్గంలో డబ్బుకు తప్ప పార్టీ లాయల్టీకి విలువలేదా? ఆ చర్చే ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇరకాటంగా మారిందా? దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు ఆవేదనతో రాజీనామా చేయడం శాసనసభ్యురాలికి ఇబ్బంది కాబోతోందా? టీడీపీకి రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగుతుందా? లేక ఇంకా ఉందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం… హాట్ హాట్ పాలిటిక్స్‌కు ఎప్పుడూ కేరాఫ్ అడ్రస్. మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల దాడులు,…
మాకేంటంట…. అహ… అసలు మాకేంటంట… అంటూ అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో తెగ రెచ్చిపోతున్నారట ఆ ఎంపీ మనుషులు. నా నియోజకవర్గంలో ఏం జరుగుతోందో నాకు తెలియాలి… తెలియాలి… తెలియాలి… అంటూ ఎంపీ రీ సౌండ్‌లో డైలాగ్ చెబుతుంటే…. ఆయన అనుచరులు మాత్రం ఇసుక, బుసక, సిలికా ఏదైనా సరే… మా వాటా మాకు రావాల్సిందేనని అంటున్నారట. ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉందా పరిస్థితి? ఎవరా ఫస్ట్‌టైం ఎంపీ? ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేక…
గోషామహల్ ఎమ్మెల్యే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా? పాపం రాజాసింగ్ అనే పరిస్థితి వచ్చిందా? ఆవేశం ఆయన కొంప ముంచిందా? తాను రాజీనామా చేసిన బీజేపీనే ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు? ఎవరివో రాజకీయ వ్యూహాలకు రాజా బలయ్యారా? క్షవరం అయితేగానీ… వివరం తెలీదన్నట్టుగా ఎమ్మెల్యే పరిస్థితి మారిపోయిందా? ఓన్లీ… హిందుత్వ అజెండాతో పనిచేస్తూ… రాజకీయంగా ముందుకు పోతున్న లీడర్ రాజాసింగ్. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆయనకు. ఆ ఫైర్ బ్రాండ్‌కు ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్…
తెలంగాణ సచివాలయంలో ఏదో… ఏదేదో… జరిగిపోతోందా? మంత్రులకు తెలియకుండానే శాఖల్లో కీలకమైన ఫైళ్లు కదిలిపోతున్నాయా? ఫైళ్లదాకా ఎందుకు… పెద్ద ఆఫీసర్స్ నియామకాలు, బదిలీలు కూడా వాళ్ళకు తెలియకుండా జరుగుతున్నాయా? అసలు మినిస్టర్స్‌కు తెలియకుండా వాళ్ళ డిపార్ట్మెంట్స్లో వేళ్ళు పెడుతున్నది ఎవరు? కేబినెట్లో అసహనం ఎందుకు పెరుగుతోంది? తెలంగాణ క్యాబినెట్‌లోని మెజార్టీ మంత్రులు తమ శాఖల్లో జరుగుతున్న వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు తమకెందుకులే అన్న ధోరణితో ఉంటే.. మరికొందరు మాత్రం మాకు తెలియకుండా మా శాఖల్లో…
తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆ నాయకురాలు తడబడుతున్నారా? సరైన నిర్ణయాలు తీసుకోలేక పార్టీకి ఉన్న బలాన్ని కూడా పోగొడుతున్నారా? నాడు తండ్రికి అండగా నిలబడ్డవాళ్ళంతా నేడు తనకు ఎందుకు దూరం అవుతున్నారని విశ్లేషించుకోలేకపోతున్నారా? ఆమెది అనుభవరాహిత్యమా? లేక నాకంతా తెలుసునన్న అహంకారమా? ఎవరా లీడర్? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ. అలాగే వైసీపీకి కంచుకోట ఇది. మొదట్లో ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యం ఉండేది. వైసీపీ ఆవిర్భావం తర్వాత…