ఆ నాయకుడికి టికెట్ చేజారిపోయిందా?నామినేటెడ్ పదవి వద్దనుకున్నారా? చివరకు ఆయనకు దక్కింది ఏమిటి? సొంత నియోజకవర్గంలో పదవులు వదులుకుని, పక్క నియోజకవర్గంలో ఇల్లీగల్ వ్యాపారం ఎంచుకోవడానికి కారణమెంటి? అక్రమ వ్యాపారం లాభసాటిగా సాగడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూనే… గతంలో పార్టీ కోసం ఖర్చు చేసిన. డబ్బులు రాబట్టుకుంటున్నారా? టీడీపీ సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇసుకాసురుడిగా. మారారట. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికరేవుల ఇసుక స్టాక్ పాయింట్‌కు కుందుల కింగ్ మేకర్. కొవ్వూరులోని వివిధ ర్యాంపుల్లో తీసిన గోదావరి. ఇసుకను ఆరికిరేవుల స్టాక్ పాయింట్ తీసుకుని వస్తారు. ఇక్కడ ఇసుకను తెలంగాణకి అక్రమంగా తరలిస్తున్నారు. కృష్ణాజిల్లా సరిహద్దుల్లోని తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 21 లారీలను. పోలీసులు పట్టుకున్నారు. వీటిపై కేసులు నమోదు చేసి ఇదంతా ఎక్కడ నుంచి వస్తుందని విచారణ చేపట్టారు.దీంతో ఈ లారీల్లో ఎటువంటి వే బిల్లులు లేకుండా ఇసుక అంతా…కొవ్వూరు మండలం ఆరికరేవుల స్టాక్ పాయింట్ నుంచి అక్రమ రవాణా అవుతున్నట్లు గుర్తించారు. ఒకే వే బిల్లుపై 5 నుంచి 10 లారీల్లో. ఇసుక అక్రమ రవాణా అవుతున్నట్లు కనుగొన్నారు.దీంతో అక్రమ ఇసుక బాగోతం బయటపడింట.
గోదావరి వరదలతో ఇసుక కొరత రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా అధికారులు స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. స్టాక్ పాయింట్లలో కొండలను తలపించే విధంగా ఇసుక నిల్వ చేశారు. ఈ స్టాక్ పాయింట్ల నుంచి అన్ని ప్రాంతాలకు ఇసుక సరఫరా చేస్తున్నారు. రోజు వందలాది లారీలు ఇసుక స్టాక్ పాయింట్ నుంచి తరలి వెళుతున్నా ఇక్కడ కొండలు తరగడం లేదట. కారణం నిల్వచేసిన ఇసుకను ఎటువంటి వేబిల్లులు లేకుండా అక్రమ రవాణా అవుతుంది. పగలు ఇసుక అక్రమ రవాణా చేయడం, రాత్రుళ్లు. మళ్లీ. దొంగచాటుగా స్టాక్ పాయింట్ లో ఇసుక అక్రమంగా డంప్ చేస్తున్నారు. ప్రతిరోజు వందలాది లారీలు ఇసుక అక్రమ రవాణా అవుతున్న తరగడం లేదట. లక్ష క్యూబిక్ మీటర్లు ఇసుక స్టాక్ యాడ్ లో నిల్వ చేస్తే మూడు నెలలుగా కేవలం 29 వేల 500 క్యూబిక్ మీటర్లు మాత్రమే అమ్మినట్లు లెక్క చూపుతున్నారు. ఇప్పటికీ స్టాక్ యాడ్ లో 71వేల 500 క్యూబిక్ మీటర్లు ఇసుక నిల్వ ఉందట. స్టాక్ పాయింట్ లో ఇసుక నిల్వలు భారీగా కనిపించడంతో గోదావరి వరదలు తగ్గిన బోట్ మెన్స్ సొసైటీలు ర్యాంపులు తెరుచుకోవటానికి. అధికారులు అనుమతి ఇవ్వటం లేదు. దీంతో పడవ కార్మికులు గడిచిన వంద రోజులుగా ఉపాధి కోల్పోయారు. టీడీపీ సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ పైరవీలు చేసి బోట్ మెన్ సొసైటీల ర్యాంపులు తెరవకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్టాక్ పాయింట్ లో ఇసుక నిల్వ ఉండటం వల్ల అప్పుడే అనుమతులు ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారట. దీంతో పడవ కార్మికులు ఉపాధి కోల్పోయి గగ్గోలు పెడుతున్నారు. దీనంతటికీ కారణం ఇసుక మాఫియా నుంచి అధికారులకు భారీగా ముడుపులు అందడమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార లెక్కల ప్రకారం ఈ స్టాక్ పాయింట్ లో టన్ను ఇసుక 160 రూపాయలు అమ్మాల్సి ఉండగా 350 రూపాయల వరకు విక్రయిస్తున్నా అధికారులు నోరు మెదపడం లేదట. ఉచిత ఇసుకకు లోదకాలు ఇచ్చి ఈ టీడీపీ నేత జేబులు. నింపుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
గత ఎన్నికల నాటినుంచి రాజకీయంగా దూరంగా ఉంటున్న టీడీపీ సీనియర్ నాయకులు కుందుల సత్యనారాయణ
కే వి వి ఎస్ ఎన్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో కాంట్రాక్ట్ పొంది ఈ అక్రమ ఇసుక రవాణాకు తెర లేపారు. నిడదవోలుకు చెందిన కుందుల సత్యనారాయణ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించారు. తనకే టికెట్ ఖరారు అవుతుందని నిడదవోలులో తెలుగుదేశం పార్టీ ప్రటిష్ట పర్చేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారట. చివరకు కూటమి పొత్తు కారణంగా ఈ అసెంబ్లీ స్థానం జనసేనకు దక్కింది. నిరాశ చెందిన కుందుల సత్యనారాయణ ఎన్నికల నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ టిక్కెట్టు ఆశించి భంగపడిన నేతలకు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి బుజ్జగించారు.కానీ కుందుల సత్యనారాయణ నామినేటెడ్ పోస్టు తీసుకోవటానికి కూడా నిరాకరించారట. దీనికి బదులుగా. ఇసుక కాంట్రాక్టు తీసుకున్నారని ప్రచారం జరుగుతుందట. అడగటమే తరువాయి నిడదవోలు నియోజకవర్గంలో ఖాళీ లేవని పక్కన ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలోని సత్యనారాయణకు ఈ ఇసుక కాంట్రాక్టు దక్కిందని సొంత పార్టీ వారే ప్రచారం చేస్తున్నారట. కోట్లు ఖర్చు చేసినా టిక్కెట్ దక్కలేదని బాధలో ఉన్న కుందుల సత్యనారాయణ… అక్రమ ఇసుక వ్యాపారంలో కోట్లు గడిస్తున్నారని పబ్లిక్ టాక్. బహుశా ఇదేనేమో పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదని అనడానికి నిదర్శనమని సొంత టిడిపి పార్టీలోనే గుసగుసలాడుకుంటున్నారు.