ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైసీపీ తరఫున మరోసారి అవకాశం దక్కించుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. నాలుగు స్థానాల్లో విజయసాయిరెడ్డితో పాటు నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులను జగన్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీవీతో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. నా పై అచంచల విశ్వాసం ఉంచి రాజ్యసభకు మరోసారి పంపిస్తున్న ముఖ్యమంత్రి దంపతులు జగన్, భారతి లకు ధన్యవాదాలు తెలిపారు. నా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా…
కేటీఆర్ మాటలు గురివింద సామెత లెక్క ఉన్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబం తో పోల్చుకునే ప్రయత్నం చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు. దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్ళిన కుటుంబం గాంధీ కుటుంబం అన్నారు రేవంత్.
ఏపీ సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం జగన్ పరిశీలించారు. వైఎస్ఆర్ పార్కులో దివంగత నేత ఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.