మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో చరణ్ లెజెండరీ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నాడు. ఇక టాపిక్‌లోకి వెళితే… కేరళను రామ్ చరణ్ మేనియా పట్టుకుంది. నిన్న కేరళలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది చాలా స్పష్టంగా కనిపించింది. కేరళలోని చరణ్ అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద ఘనంగా జరుపుకున్నారు. ఈవెంట్ లొకేషన్ నుండి వచ్చిన ఒక వీడియోలో చరణ్ అభిమానులు పోస్టర్లు, లైఫ్ సైజ్ కటౌట్‌లను మోస్తూ కనిపించారు. ఈవెంట్ వేదిక వద్ద సాంప్రదాయ కేరళ డ్రమ్స్‌తో సంబరాలు చేసుకోవడంతో చరణ్ అభిమానులు పండుగ మూడ్‌లోకి మారిపోయారు.
చరణ్ కేరళలో భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. ఆయన నటించిన గత చిత్రం ‘వినయ విధేయ రామ’ కేరళలో అధిక అంచనాల మధ్య విడుదలైంది. ఆ సమయంలోనే చరణ్ కు కేరళలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పై క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ వేదిక వద్ద సంబరాలు మిన్నంటాయి. స్కై-హై హైప్ మధ్య ‘ఆర్ఆర్ఆర్’తో తన స్టార్‌డమ్‌ను తదుపరి స్థాయికి పెంచుకోవాలని చరణ్ ఆశిస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమానికి కేరళ సూపర్ స్టార్ టోవినో థామస్ విచ్చేశారు. ఆయన సినిమా గురించి గొప్పగా మాట్లాడాడు.