‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మాగ్నమ్ ఓపస్ లో ఒక హీరోగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు ప్రారంభించాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. కొరటాల ‘ఆచార్య’ను పూర్తి చేసే పనిలో ఉంటే, ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మరోవైపు వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ ఎవరన్న విషయంపై చర్చ మొదలైంది. ముందుగా ఈ సినిమా కోసం కొరటాల ఓ బాలీవుడ్ హీరోయిన్ ను ఖరారు చేశాడని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మాత్రం మరో టాలీవుడ్ సౌత్ హీరోయిన్ సమంత పేరు విన్పిస్తోంది.
ఈ భారీ బడ్జెట్ మూవీలో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి సమంతని మేకర్స్ సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి చిత్రబృందం ఇంకా సామ్ ని సంప్రదించనప్పటికీ, టీమ్ మునుపెన్నడూ లేని విధంగా సమంత పాత్రను ఎలివేట్ చేసే స్క్రిప్ట్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రంలో నటించే అవకాశం సామ్ ను వరిస్తుందా ? లేదా అనేది చూడాలి.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతి తర్వాత హైదరాబాద్‌లో లాంఛనంగా ‘పూజా’ కార్యక్రమాన్ని నిర్వహించి సినిమాను ప్రారంభించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. గాథలో దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ అన్న విషయం తెలిసిందే.