ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించి 2005 నుండి పలు చిత్రాలను నిర్మిస్తూ, నటిస్తున్నాడు నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్. అంతేకాదు… తన తమ్ముడు ఎన్టీఆర్ తోనూ ఆ బ్యానర్ లో ‘జైలవకుశ’ చిత్రాన్ని నిర్మించాడు. త్వరలో తెరకెక్కబోతున్న ఎన్టీయార్ – కొరటాల శివ చిత్రానికి, ఆ తర్వాత వచ్చే ఎన్టీయార్ – తివిక్రమ్ సినిమాలకు కూడా కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. ఇదే సమయంలో నటుడిగానూ కళ్యాణ్ రామ్ ఇప్పుడు వేగం పెంచాడు. 2020లో…