విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు అని అభిమానులు ఆ విఖ్యాత నటుణ్ణి ఆరాధించేవారు. కొందరు కొంటె కోణంగులు అప్పట్లో ‘విశ్వం’ అంటే ‘ఆంధ్రప్రదేశా?’ అంటూ గేలిచేశారు. అయితే నిజంగానే యన్టీఆర్ తన నటనాపర్వంలోనూ, రాజకీయ పర్వంలోనూ అనేక చెరిగిపోని, తరిగిపోని రికార్డులు నెలకొల్పి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ముందు నవ్వినవారే, తరువాత ‘విశ్వవిఖ్యాత’ అన్న పదానికి అసలు సిసలు న్యాయం చేసిన ఏకైన నటరత్నం అని కీర్తించారు! అదీ యన్టీఆర్ సాధించిన ఘనత! ఆయన ఏ నాడూ…
నటనలోనే కాదు దర్శకునిగానూ తనదైన బాణీ పలికించారు యన్.టి.రామారావు. ప్రపంచంలో మరెవ్వరూ చేయని విధంగా తాను దర్శకత్వం వహించిన చిత్రాలకు టైటిల్ కార్డ్స్ లో పేరు వేసుకోరాదని భావించారు యన్టీఆర్. దర్శకునిగా ఎవరి పేరూ వేయలేదంటే ‘ఈ సినిమాకు యన్టీఆర్ దర్శకత్వం వహించారు’ అని జనమే భావించాలని ఆశించారు. ఆ కారణంగానే యన్టీఆర్ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సీతారామకళ్యాణం’ (1961), రెండో సినిమా ‘గులేబకావళి కథ’ (1962)కు టైటిల్ కార్డ్స్ లో దర్శకునిగా పేరు…
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను టీడీపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వేడుకల్లో సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు తిరుపతితో ఎంతో అనుబంధం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని, ఆయన ఓ సమగ్ర సమతా మూర్తి అని ఎన్వీ రమణ కొనియాడారు. రైతుబిడ్డగా, రంగస్థల నటుడిగా, కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగారని, ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని…
ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగినప్పుడు.. టిడిపి నేతలు,శ్రేణులు పాల్గొనేవారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన కుటుంబసభ్యులు.. ఇటు తెలంగాణ టిడిపి శ్రేణులు జయంతి ,వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అయితే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్బంగా తెలంగాణలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మారుతూ వచ్చాయి. తెలంగాణలో క్రమంగా టిడిపి…
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు విగ్రహా రూపాల కంటే.. వాళ్ల రూపం అచ్చం ఇలాగే ఉంటుందేమోనని అనిపించేలా.. ఇప్పటికీ, ఎప్పటికీ.. తెలుగువారికి గుర్తుకొచ్చే రూపం ఆయనదే. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర శాశ్వతం. తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన శక పురుషుని శత జయంతి సంవత్సరం ఇది. సినీనేత.. జననేత.. తిరుగులేని కథానాయకుడు.. ఎదురులేని మహానాయకుడు… విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి…
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి వేళ ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబునాయుడు, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను టార్గెట్ చేశారు మంత్రి రోజా. ఎన్టీఆర్ తనయుడు బాలయ్యను చూస్తే జాలేస్తోందన్నారు రోజా. ఎన్టీఆర్ కి వెన్నుదన్నుగా బాలయ్య ఆరోజుల్లో వుండి వుంటే.. జగన్ సీఎం అయినట్టే బాలయ్య కూడా కీలక పదవిలో వుండేవారన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుండేదన్నారు. ఎన్టీఆర్ కొడుకుల అమాయకత్వాన్ని…
మహానాడు రెండో రోజున భారీ బహిరంగ సభ జరగనుంది. వివిధ జిల్లాల నుంచి బహిరంగ సభకు తరలి వస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని టీడీపీ అంచనా వేసింది. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి కార్లు, ట్రాక్టర్లు, వివిధ వాహనాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు వస్తుండడంతో ఒంగోలుకి వచ్చే దారులన్నీ పసుపుమయంగా మారాయి.
ఏపీలో వైసీపీ నేతలు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలు కొనసాగుతున్నాయి. ఈ యాత్రలపై టీడీపీ మండిపడుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతల బస్ యాత్ర ఎత్తిపోయింది. వాళ్లే కుర్చీలు తీసుకెళ్తున్నారు.. జనం లేకపోయేసరికి వాళ్లే కుర్చీలను తీసుకెళ్లిపోతున్నారని విమర్శించారు. జగన్ స్వయంగా తమది రివర్స్ పాలన అని చెప్పారు. ఇప్పుడు వైసీపీ బస్ యాత్ర అంతా రివర్సులోనే ఉంది. కైవల్యా రెడ్డి నెల్లూరులో ఆనం కుమార్తెమో కానీ..…
తెనాలి పెమ్మసాని థియేటర్‌లో నిర్వహించిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, అందులోని లింగాన్ని మింగేసే రకమని మండిపడ్డారు. ‘‘ఒక్క ఛాన్స్ అంటే, ఒక్క తప్పిదం చేశారు, ఓటు వేశారు, ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోండి’’ అంటూ ఏపీ ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘దేశమంటే కట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని ఆనాడు గురజాడ అప్పారావు అన్నారు.…
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో తెలుగురాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు ఎన్జీఆర్ విగ్రహ ఆవిష్కరణలు, ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాళలతో ఘనంగా నివాళులర్పింస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బైక్ ర్యాలీ లో పాల్లొని R&B గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసారు. ఒకే బైక్…