Anil Kumar Yadav: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై నందమూరి హీరోలు చేసిన ట్వీట్లపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఇప్పుడున్న టీడీపీ నారా వారి పార్టీగా మారిందని.. ఎన్టీఆర్ పేరు ఎత్తే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టుకోలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాన్ని వైఎస్ఆర్ తెచ్చారని.. ఆ…
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్పు వ్యవహారంపై వివాదం కొనసాగుతూనే ఉంది… పాలక, ప్రతిపక్షాల మధ్య ఈ విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి… అయితే, అసలు ఎన్టీఆర్ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో మరోసారి క్లారిటీ ఇచ్చారు మంత్రి విడదల రజిని.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె… వైఎస్ఆర్ సేవలను భావితరాలకు తెలియచేసేందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు చేశాం అన్నారు.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం ఉంది… అందుకే కొత్త జిల్లాకు…
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్‌లో వివాదం కొనసాగుతోంది… వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాన్ని సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి… వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి… విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు ఒక సామాజిక డాక్టర్… సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మిన వ్యక్తి.. కానీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అంటే మేం ఎన్టీఆర్‌కు అవమానంగానే భావిస్తున్నాం…
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదం ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతోంది.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుండగా… దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పుమంటున్నాయి.. నందమూరి ఫ్యామిలీ కూడా ఈ మార్పును తప్పుబడుతోంది.. అయితే, యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సముచితమైన నిర్ణయం అన్నారు మంత్రి సిదిరి అప్పలరాజు… ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, ఎన్టీఆర్‌ను మానసికంగా క్షోభ పెట్టారు… అందుకే ప్రాయశ్చిత్తంగా యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు అని విమర్శించారు…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మారుస్తూ.. అసెంబ్లీలో మంత్రి విడుదల రజిని తీర్మానం ప్రవేశపెట్టడం.. ఆ తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. అయితే, ఈ పరిణామాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.. అసలు, పేరు మార్చి సాధించేది ఏమిటి? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… వివాదాలు సృష్టించాలని…