ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్‌లో వివాదం కొనసాగుతోంది… వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాన్ని సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి… వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి… విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు ఒక సామాజిక డాక్టర్… సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మిన వ్యక్తి.. కానీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అంటే మేం ఎన్టీఆర్‌కు అవమానంగానే భావిస్తున్నాం అన్నారు.. అసలు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎందుకు మార్చారో సీఎం వైఎస్ జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసిన ఆమె.. ఎన్టీఆర్ కూతురుగా సీఎం వైఎస్ జగన్ చెప్పే కారణం కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రకటించారు..
Read Also: Nitin Gadkari: వాయు కాలుష్యం ప్రధాన సమస్య.. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే
ఇక, ఎన్టీఆర్ హెల్త్ యూనిర్సిటీ నుంచి ఎన్టీఆర్ పేరు తొలగిండచంపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెప్పుకునే అవకాశం ఉందన్నారు పురందేశ్వరి… ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌పై సూటిగా స్పందించలేదు.. అలాగే యార్లగడ్డ వ్యాఖ్యలపై కూడా పురందేశ్వరి స్పందించలేదు.. మరోవైపు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉన్న అనేక పథకాలు ఎన్టీఆర్ హయాంలో వచ్చినవేనని గుర్తుచేశారు పురందేశ్వరి… రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక, అభివృద్ధి నిరోధక పాలన జరుగుతోందని ఆరోపించిన ఆమె.. ఎన్టీఆర్ అంటే గౌరవం అంటూనే.. అసలు ఆయన పేరుతో ఉన్న యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో సీఎం చెప్పాలన్నారు. ఇక, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే తనకు కూడా అపారమైన గౌరవం ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు పురందేశ్వరి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇంకా ఏ అంశాలపై మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..