విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరాముడు మహాభినిష్క్రమణ చేసి అప్పుడే 26 ఏళ్ళయింది. అయినా ఆయనను మరచినవారు లేరు. అన్నగా జనం గుండెల్లో నిలిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు ‘పెద్దాయన’గా నిలచిన నటరత్న యన్టీఆర్ నా అనుకున్నవారిని ఆదుకున్న తీరును ఈ నాటికీ సినీజనం తలచుకుంటూ ఉన్నారు. అలా ఆయన అభిమానంతో వెలుగులు విరజిమ్మిన వారెందరో. తెరపై అనేక మార్లు శ్రీకృష్ణ పరమాత్మగా నటించి అలరించారు రామారావు. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకొనే కన్నయ్యగా నటించడమే కాదు, నిజజీవితంలోనూ యన్టీఆర్…