నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్‌లను చెబుతుంది.. ఇటీవల ప్రభుత్వ శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నేడు నల్గొండ జిల్లా దామరచర్లలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మితమవుతున్న యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ నుంచి బయల్దేరనున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు.
తిరుమల శ్రీవారి ఆస్తులపై శనివారం నాడు టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే దేశంలోని ప్రముఖ కంపెనీల ఆస్తుల కంటే తిరుమల శ్రీవారి ఆస్తులే ఎక్కువ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో పోలిస్తే తిరుమలకు ఉండే ప్రత్యేకత వేరు. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. భక్తులు ఎన్నో విలువైన…
ఎన్టీపీసీ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలోనే అతిపెద్దదైన తేలియాడే సోలార్ ప్లాంట్ ను నిర్మించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. పివీ ప్రాజెక్ట్ లో భాగంగా చివరిదైన 20 మెగావాట్లను ఉత్పత్తి ప్రారంభం అయింది. దీంతో మొత్తం 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పరిచేస్తోంది. ఈ ఘనత సాధించినందుకు రామగుండం టీమ్ ను ఎన్టీపీసీ…
కాలుష్యం పెరిగి కొద్దీ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కాలుష్య సుడిగుండంలా మారుతోంది. పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రాంతానికి శాపంలా మారింది. రామగుండంలో భూగర్భం ఉపరితలం అంతా విషతుల్యంగా తయారైంది. ఏ విష వాయువు ఎప్పుడు వ్యాపిస్తుందో తెలియక తాగే నీరు కలుషితంతో అనారోగ్యాల బారిన పడుతూ జనం ఆందోళన చెందుతున్నారు. రామగుండం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్, జెన్…
బూడిద అంటే గతంలో అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు బూడిద అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. ప్రజాప్రతినిధులు మాఫియాగా ఏర్పడి వందల లారీల ద్వారా కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. రోజుకి లక్షల రూపాయల ఎన్టీపీసీ యాజమాన్యం సొమ్మును కొట్టేస్తున్నారు. రోజువారీ ఎవరి వాటా వారికి అప్పగిస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బొగ్గు ఆధారిత ప్రాజెక్టులో బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.కుందనపల్లి గ్రామం వద్ద 1700…
పెద్దపల్లి జిల్లా రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లోని టాటా కంపెనీకి చెందిన స్టోర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నూతనంగా నిర్మాణంలో ఉన్న సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ లోని టాటా ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్ షెడ్ డౌన్ కావడంతో ఉదయం నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా కరెంట్ సప్లై కావడంతో టాటా స్టోర్స్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్…