NTPC Recruitment 2024: నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్‌లను చెబుతుంది.. ఇటీవల ప్రభుత్వ శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 3 లోపు అధికార వెబ్ సైట్‌లోని వివరాల ప్రకారం అప్లై చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 223 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు -223
పోస్టుల వివరాలు..
ఎన్‌టీపీసీ తాజా నోటిఫికేషన్ ద్వారా ఆపరేషన్స్ విభాగంలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్స్) పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఓపెన్ కేటగిరీలో 98 పోస్టులు; ఈడబ్ల్యూఎస్‌లో 22; ఓబీసీ కేటగిరీలో 40; ఎస్‌సీ అభ్యర్థులకు 39; ఎస్‌టీ కేటగిరీలో 24 పోస్ట్‌లు ఉన్నాయి.
అర్హతలు..
ఎలక్ట్రికల్/మెకానికల్ బ్రాంచ్‌లతో బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్ తర్వాత ఏదైనా పవర్ ప్లాంట్‌లో కనీసం ఏడాది పని అనుభవం తప్పనిసరి.. ఎన్‌టీపీసీ తొలుత మూడేళ్ల కాల వ్యవధికి నియామకాలు ఖరారు చేస్తుంది. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంది.. ఈ పోస్టులకు ఎంపికైన వారు ఇదేళ్ల వరకు పని చెయ్యాల్సి ఉంటుంది..
వేతనం..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్) పోస్ట్‌లకు ఎంపికైన వారికి నెలకు రూ.55 వేల వేతనం లభిస్తుంది. దీంతోపాటు ఇంటి అద్దె భత్యం, నైట్ షిఫ్ట్ అలవెన్స్, ఉద్యోగికి, అతని కుటుంబానికి వైద్య సదుపాయాలను సైతం అందిస్తారు..
ఎన్‌టీపీసీకి చెందిన పవర్ స్టేషన్స్, ప్రాజెక్ట్స్‌లలో.. మెయింటనెన్స్, ఆపరేషన్స్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్లాంట్ ఆపరేషన్స్ పర్యవేక్షణ, నియంత్రణ; భద్రత, నాణ్యత ప్రక్రియలను నిర్వహించడం, సమస్యలను పరిష్కరించడం, ప్లాంట్ రికార్డ్స్, రిపోర్ట్స్ నిర్వహణలో పనిచేయాల్సి ఉంటుంది..
ఎంపిక ప్రక్రియ..
స్క్రీనింగ్ టేస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, వెయిటేజీ విధానం..
ఇక ఎన్‌టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ల గత నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం అనివార్యంగా మారుతోంది. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు దశ నుంచే స్క్రీనింగ్ టెస్ట్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.. మిగిలిన సమాచారం కోసం నోటిఫికేషన్ లో చూడవచ్చు..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 8, 2024
కాల్ లెటర్స్: మార్చి రెండు లేదా మూడో వారంలో
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/, https://www.ntpc.co.in/ లను పరిశీలించగలరు..