Balakrishna : తన సినిమాలు సమాజానికి మెసేజ్ ఇస్తాయని హీరో బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షలతో నిర్మించిన తరగతి గదుల భవనంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలని మా నాన్న ఎన్టీ రామారావు చెప్పారు. ఇలాంటి భవిష్యత్తు కార్యక్రమాలకు పునాది వేసింది కూడా ఆయనే. హిందూపురంలో పరిశ్రమలు, పాఠశాలలు…
ఎన్టీ రామారావు.. ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది.. కాదు కాదు ఈ పేరుతోనే ఓ చరిత్ర రాయొచ్చు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ అపురూపమైన గ్రంథాన్ని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకోని వారంటూ ఉండరు. 1951లో విడుదలైన పాతాళ భైరవి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో “వంద రోజులు” పూర్తి చేసుకున్న సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే…
తెలుగునాట జానపద చిత్రాలు అనగానే ముందుగా స్ఫురించే పేరు నటరత్న యన్.టి.రామారావుదే! ఆ తరువాతే ఎవరి పేరైనా గుర్తుకు వస్తుంది. యన్టీఆర్ తరువాత ఎక్కువ జానపద చిత్రాలలో హీరోగా నటించిన ఘనత కాంతారావుదే! వారిద్దరూ కలసి అనేక జానపద చిత్రాలలో నటించారు. ఇక కాంతారావు సైతం జానపద కథానాయకునిగా ఊపుమీదున్న రోజుల్లో ఆయన యన్టీఆర్ తో కలసి సమానస్థాయిలో నటించిన జానపదం ‘చిక్కడు-దొరకడు’ అనే చెప్పాలి. శ్రీలక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై బి.విఠలాచార్య దర్శకత్వంలో పొట్లూరి వెంకటనారాయణ, కుదరవల్లి…
జూనియర్ ఎన్టీఆర్ కి భయపడి పార్టీ నుంచి తరిమేసారని ఆర్కే రోజా అన్నారు. ఇవాళ ఏపీ పర్యాటక శాఖమంత్రి ఆర్కే రోజా (శనివారం) ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో 99 శాతం మంది ప్రజలు ప్రేమతో ఆదరిస్తూన్నారని అన్నారు. లక్షా 35 వేల కోట్లను సంక్షేమ పథకాలకు కేటాయించారని రోజా తెలిపారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన శని అని గతంలోనే స్వర్గీయ…
ఒకప్పుడు హిందీ రీమేక్స్ కు తెలుగులో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా నటరత్న నందమూరి తారక రామారావుదే! ఆయన నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు ఆకలిది” వంటి హిందీ రీమేక్స్ బాక్సాఫీస్ బరిలో జయకేతనం ఎగురవేశాయి. వాటి సరసన చేరిన చిత్రం యన్టీఆర్ నిర్మించి, నటించిన ‘అనురాగదేవత’. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషా’ ఆధారంగా ‘అనురాగదేవత’ రూపొందింది. 1982 జనవరి 9న సంక్రాంతి కానుకగా ‘అనురాగదేవత’ జనం…
(ఆగస్టు 30న శ్రీకృష్ణాష్టమి) తెలుగునాటనే కాదు యావద్భారతంలోనూ శ్రీకృష్ణ పాత్రలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు ఖ్యాతి గాంచారు. ఆయన శ్రీకృష్ణ పాత్ర ధరించిన అనేక చిత్రాలు హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా భాషల్లోకి అనువాదమై అలరించాయి. ఉత్తరాదిన శ్రీకృష్ణ పాత్రకు అంతకు ముందు పెట్టింది పేరుగా నిలచిన షాహూ మోడక్ ను సైతం యన్టీఆర్ అభినయం మరిపించింది. యన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీకృష్ణుని గెటప్ లో కనిపించిన చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు’. 1954లో ఎఫ్. గఫూర్ రూపొందించిన…
(జూలై 14తో యన్టీఆర్ ‘శాంత’కు 60 ఏళ్ళు)నటరత్న యన్.టి.రామారావు, అంజలీదేవి అనేక చిత్రాలలో నటించి జనాన్ని విశేషంగా అలరించారు. వారిద్దరూ నటించిన ‘శాంత’ చిత్రం జూలై 14తో 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని మానాపురం అప్పారావు దర్శకత్వంలో ఎమ్.ఆర్.జయరామ్ నిర్మించారు. ఇదే మానాపురం అప్పారావు దర్శకత్వంలో తరువాత మరో రెండేళ్ళకు యన్టీఆర్, అంజలీదేవి జంటగానే ‘పరువు-ప్రతిష్ఠ’ అనే చిత్రం రూపొందింది. ఈ రెండు చిత్రాల కథ దాదాపు ఒకేలా ఉండడం గమనార్హం. అంతేకాదు, ఈ…