అరవై ఏళ్ళ ‘శాంత’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూలై 14తో యన్టీఆర్ ‘శాంత’కు 60 ఏళ్ళు)
నటరత్న యన్.టి.రామారావు, అంజలీదేవి అనేక చిత్రాలలో నటించి జనాన్ని విశేషంగా అలరించారు. వారిద్దరూ నటించిన ‘శాంత’ చిత్రం జూలై 14తో 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని మానాపురం అప్పారావు దర్శకత్వంలో ఎమ్.ఆర్.జయరామ్ నిర్మించారు. ఇదే మానాపురం అప్పారావు దర్శకత్వంలో తరువాత మరో రెండేళ్ళకు యన్టీఆర్, అంజలీదేవి జంటగానే ‘పరువు-ప్రతిష్ఠ’ అనే చిత్రం రూపొందింది. ఈ రెండు చిత్రాల కథ దాదాపు ఒకేలా ఉండడం గమనార్హం. అంతేకాదు, ఈ సినిమాలో యన్టీఆర్, అంజలి తనయునిగా నటించిన చలం, ‘పరువు-ప్రతిష్ఠ’లోనూ వారి కొడుకుగానే నటించారు. పైగా రెండు చిత్రాలలోనూ చలం పేరు వేణు కావడం గమనార్హం! మరో విశేషమేమంటే, యన్టీఆర్, అంజలీ జంటగా నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’లో ఆమె పేరు శాంత. అందువల్లే ఈ చిత్రానికి ‘శాంత’ అన్న టైటిల్ ను నిర్ణయించినట్టు అప్పట్లో నిర్మాతదర్శకులు చెప్పారు.
‘శాంత’ కథ విషయానికి వస్తే, అందమైన శాంతపై దయానిధి అనే కామాంధుడు కన్నేస్తాడు. పలు పాట్లు పడి అతని నుండి, మరికొందరు దుర్మార్గుల నుండి తప్పించుకొని లాయర్ శ్రీనివాస్ చెంత చేరుతుంది. అతని భార్య చనిపోయి, ఓ కొడుకు ఉంటాడు. ఆ అబ్బాయి పేరు కుమార్. అతణ్ణి శాంత కన్నకొడుకులా చూస్తుంది. దాంతో శ్రీనివాస్, శాంతను పెళ్ళాడతాడు. మళ్ళీ దయానిధి, శ్రీనివాస్ మిత్రునిగా ఇంట ప్రవేశించి, అతణ్నే చంపాలని చూస్తాడు. విషం కలిపిన పాలు త్రాగి కుమార్ మరణించడంతో, శాంతను శ్రీనివాస్ అనుమానించి, ఇంట్లోంచి గెంటేస్తాడు. ఆత్మహత్యకు పాల్పడబోతున్న శాంతకు ఓ పసిపాప కనిపిస్తుంది. దయానిధి చేతిలో మోసపోయిన ఓ అభాగ్యురాలి కూతురు ఆ పాప. ఆ పసిపాపను పెంచి పెద్ద చేస్తుంది. సరోజ అనే పేరు పెడుతుంది. శ్రీనివాస్ కొడుకు వేణు, సరోజ ఒకే చోట చదువుకోవడంతో ప్రేమలో పడతారు. చివరకు విషయం తెలుసుకున్న శ్రీనివాస్, వేణు కలసి దయానిధికి బుద్ధి చెప్పడంతో కథ ముగుస్తుంది.
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ఈ చిత్రంలో కాంతారావు, రేలంగి, గుమ్మడి, కేవీఎస్ శర్మ, కృష్ణకుమారి, సూర్యకాంతం, ఛాయాదేవి, గిరిజ, బాలసరస్వతి నటించారు. ఆరుద్ర, కొసరాజు, సముద్రాల జూనియర్ పాటలు రాశారు. సముద్రాల జూనియర్ సంభాషణలు కూడా పలికించారు. ఈ చిత్రానికి రమేశ్ నాయుడు సంగీతం సమకూర్చారు. యన్టీఆర్ కు రమేశ్ నాయుడు స్వరకల్పన చేసిన తొలి చిత్రం ఇదే. దీని తరువాత 1973లో యన్టీఆర్ ‘దేవుడు చేసిన మనుషులు’కు మళ్ళీ రమేశ్ నాయుడు సంగీతం అందించారు. శాంతికళ ఫిలిమ్స్ పతాకంపై ‘శాంత’ రూపొందింది.
తాజావార్తలు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!