ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సీటీని సందర్శించేందుకు ఓయూ వీసీని అనుమతులు కోరగా.. ఆయన నిరాకరించారు. దీంతో ఎన్‌ఎస్‌యూఐ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హై కోర్టు నిర్ణయాన్ని.. ఓయూ వీసీకే వదిలేసింది. అయితే.. ఈ నెల 5వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, వారికి తెలియజేయాలని ఓయూ అధికారులను ఆదేశించింది హై కోర్టు. అయితే తాజాగా మరోసారి రాహుల్ గాంధీ…
తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీపీసీసీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్ని నిలువరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న హైదరాబాద్ లో విద్యార్థి నాయకుల అరెస్టులకు నిరసనగా సోమవారం కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం చేయాలని టీపీసీసీ అధ్యక్షేులు రేవంత్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు ఎన్ఎస్…
National Students Union Of India (NSUI) Protest at Front on TSPSC Office. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ‘ఛలో టీఎస్పీఎస్సీ’కి పిలుపునిచ్చింది. దీంతో నాంపల్లిలో బుధవారం మధ్యాహ్నం ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్‌ఎస్‌యూఐ పిలుపు మేరకు విద్యార్థులు టీఎస్పీఎస్సీ భవనం సమీపంలోని గాంధీ భవన్‌లో గుమిగూడారు. అక్కడ అప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.…
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై ఫిర్యాదు చేసినప్పటికీ తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీ పోలీస్ స్టేషన్ల ముందు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు నుంచి ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్,…
ఆ పార్టీలో పదవులు రాకుంటే పెద్దస్థాయిలో పంచాయితీ జరుగుతుంది. తీరా పదవులు ఇస్తే పని చేయడం లేదట. తాపీగా రిలాక్స్ అవుతున్నారట. వర్క్ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిన నాయకులు ఎవరు? వర్కింగ్ ప్రెసిడెంట్లకు నో వర్క్.. నో మూడ్..!తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు.. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డితోపాటు ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను నియమించారు. మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహేశ్‌గౌడ్, అజారుద్దీన్.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌లు ఆ…
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వివాదం రేపుతున్నాయి. ఇంటర్ బోర్డు వైఖరి వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ కాలేజీల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు NSUI ప్రకటించింది. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల బలైన విద్యార్థుల కోసం తాము పోరాడుతుంటే ఇంటర్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసుల చేత తమను అక్రమంగా అరెస్ట్ చేయిస్తోందని NSUI పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము అభిలాష్ ఆరోపించారు. Read…
మొన్న విడుదలైన ఇంటర్మీడియేట్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు బలైన విద్యార్థుల న్యాయం కోసం NSUI పోరాడుతుంటే ఇంటర్మీడియేట్ బోర్డు కనీసం స్పందించకుండా,పోలీసులను అడ్డం పెట్టుకోని మమ్మల్ని అడ్డుకోవడం వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడంలో భాగమేనని NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ మండిపడ్డారు. ఈ రోజు ఇంటర్మీడియేట్ బోర్డులో అధికారులను కలిసేందుకు వెళ్ళిన NSUI బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.విద్యార్థుల ప్రాణాలకు బాధ్యులైన తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు తీరుకు నిరసనగా డిసెంబర్ 20వ…
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యార్ధి, నిరుద్యోగ జంగ్ సైరన్ ఉద్రిక్తతలకు దారితీసింది. దిల్‌షుఖ్ నగర్ నుంచి పార్టీ ర్యాలీని చెపట్టానలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు దిల్‌షుఖ్ నగర్, ఎల్బీనగర్‌కు చేరుకున్నారు. ఎల్బీనగర్‌లోని కూడలిలో ఉన్న శ్రీకాంత్ చారి విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్త కళ్యాణ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్ధిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది.…
హుజురాబాద్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక ఈనెల 30 వ తేదీన జరగబోతున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించాయి. టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ బరిలో ఉంటే, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధిపై అనేక చర్చలు జరిగాయి. మొదట కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండ సురేఖను అనుకున్నా, ఆమె తిరస్కరించడంతో తెరపైకి అనేక పేర్లు వచ్చాయి.…