కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. మెగా వేలంలో 10 జట్లు రూ.639.15 కోట్లు వెచ్చించి 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వేలంలో క్రికెట్ అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. ఈసారి మెగా వేలంలో ఆర్సీబీ19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తాజాగా ఆర్‌సీబీ ఐపీఎల్ కి ముందే ఓ వివాదంలో చిక్కుకుంది.
కొత్త సెడాన్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే అదిరిపోయే శుభవార్త ఉంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. సెడాన్ ఆరాపై ఈ (నవంబర్) నెలలో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. నవంబర్ 2024లో హ్యుందాయ్ ఆరాను కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 43,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
అక్టోబర్ నెలలో వేడిని అనుభవించారా..? 2024 అక్టోబర్ దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నెలగా నమోదైంది. వాతావరణ శాఖ ప్రకారం.. గతంలో 1951 అక్టోబర్‌లో చాలా వేడిగా ఉన్నట్లు నమోదు కాగా.. తాజాగా 120 ఏళ్ల తర్వాత మళ్లీ చోటు చేసుకుంది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో మధ్య భారతదేశంలోని (మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్)లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. అంతేకాకుండా.. ఢిల్లీ NCR సహా ఉత్తర-పశ్చిమ భారతదేశంలో కూడా అక్టోబర్ నెలలో ఎక్కువ వేడి నమోదైంది.
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ధరల శ్రేణిని రూ.390గా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తం రూ.11,300 కోట్ల సమీకరణకు వస్తున్న స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6 నుంచి 8 వరకు కొనసాగనుంది.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు విదేశాల్లో పర్యటించి అందమైన జ్ఞాపకాలు కూడగట్టుకోవాలని ఆశపడుతుంటారు. అయితే వేరే దేశానికి వెళ్లాలంటే భారీ బడ్జెట్ అవసరమని మనందరికీ తెలుసు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆల్రెడీ సెట్స్ మీద గేమ్ చేంజర్ సినిమా ఉండగా ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేశాడు… చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆ సినిమాలను అధికారికంగా ప్రకటించారు.. ఆ సినిమాల నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. దీంతో తదుపరి సినిమాల పై చరణ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. ముందుగా చరణ్…
అక్టోబర్ నెల ఈరోజుతో ముగియనుంది.. రేపటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. కొత్త నెల ప్రారంభంతో అనేక ఆర్థిక మార్పులు జరగబోతున్నాయి. ఇది సామాన్య ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.. చమురు కంపెనీలు ఎల్‌పీజీ ధరలను నిర్ణయిస్తాయి. ఈ పండుగ సీజన్‌లో సాధారణ ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపే మార్పులు ఏమిటో తెలుసుకుందాం.. సిలిండర్ ధర.. ప్రభుత్వ చమురు కంపెనీలు ఎల్‌పిజి, పిఎన్‌జి, సిఎన్‌జి ధరలను ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయిస్తాయి.…
కరోనా మహమ్మారి సమయంలో అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి. ఆంక్షలు విధించడంతో అన్ని రంగాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయి. కరోనా నుంచి కోలుకున్నాక విమానయాన రంగం మెల్లిగా పుంజుకున్నది. మొదట వందేభారత్ పేరుతో ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం విమానాలు నడిపారు. కేవలం 32 దేశాలకు మాత్రమే విమానాలు నడిపారు. దేశీయంగా కూడా కొన్ని విమానాలను నడిపారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను క్రమంగా సడలిస్తూ వచ్చారు. 50 శాతం సీట్లతో కొన్నిరోజులు విమానాలు తిరిగాయి.…