Swiggy IPO: ఐపీఓకు సిద్ధమైన స్విగ్గీ.. ధరలు ఇలా..!
- ఐపీఓకు సిద్ధమైన స్విగ్గీ
- ధరల శ్రేణిని రూ.390గా నిర్ణయించినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ధరల శ్రేణిని రూ.390గా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తం రూ.11,300 కోట్ల సమీకరణకు వస్తున్న స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6 నుంచి 8 వరకు కొనసాగనుంది. స్విగ్గీ పోటీదారైన జొమోటో ఐపీవో జూలై 2021లో రూ.9,375 కోట్లతో ప్రారంభించింది. గత సంవత్సరం దీని స్టాక్ 136 శాతానికి పెరిగింది. తాజాగా స్విగ్గీ కూడా నవంబర్ నుంచి ఐపీవోను ప్రారంభించేందుకు రెడీ అయింది.
ఇది కూడా చదవండి: JEE Main 2025: జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..
Also Read
ఐపీఓలో భాగంగా రూ.6,800 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత వాటాదారులు తమ షేర్లు విక్రయించనున్నారు. మరో రూ.4500 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించనున్నారు. ఈ నిధులు కంపెనీకి చేరనున్నాయి. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ప్రోసస్‌కు స్విగ్గీలో 31 శాతం వాటా ఉంది. ఎంఐహెచ్ ఇండియా ఫుడ్ హోల్డింగ్స్ రూపంలో వాటాలు ఉన్నాయి. ఇందులో ఐదో వంతు వాటాను ఐపీఓలో భాగంగా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్ బ్యాంక్‌కు కూడా స్విగ్గీలో వాటాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Ukraine-Russia: ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉత్తర కొరియా సైన్యం.. ధృవీకరించిన నాటో
బెంగళూరుకు చెందిన స్విగ్గీని 2014లో స్థాపించారు. 2022లో చివరిసారిగా నిధులను సమీకరించిన వేళ కంపెనీ విలువ 10.7 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఇదే విభాగంలో 2021లో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన జొమాటో రూ.9,375 కోట్లు నిధులను సమీకరించింది. ఇష్యూ ధర కంటే 52 శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది. గతేడాది 136 శాతం మేర రాణించింది. ఈ ఏడాది వస్తున్న అతి పెద్ద ఐపీఓల్లో స్విగ్గీ కూడా ఒకటి కావడం విశేషం.
ఇది కూడా చదవండి: AP: పేదల ఇళ్ల నిర్మాణానికి స్థల వితరణకు ముందుకొచ్చిన ఓ వృద్ధురాలు.. సీఎం అభినందనలు
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..