పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లి శవంతో అక్క నాలుగురోజులుగా సహజీవనం చేస్తోంది. చెల్లి మృతి చెందినట్లు ఎవరికి తెలియనివ్వకుండా ఆమె శవం వద్దే కూర్చొని విలపిస్తోంది. చివరికి ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడడం విషయం బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌కు చెందిన దంపతులకు స్వాతి, శ్వేత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం తల్లి చనిపోగా తండ్రి ఇద్దరు కూతుళ్లను…