Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు, ప్రపంచం మొత్తం నియంతగా పిలిచే కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసిన సంచలనమే. స్వీయ నిర్భందంలో ఉండే ఈ దేశంలోని వార్తలు ప్రపంచానికి చాలా వరకు తెలియవు.
ఉత్తర కొరియా ఇవాళ పలు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను (Ballistic Missiles) పరీక్షించింది. తూర్పు సముద్రంలోకి వాటిని రిలీజ్ చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న టైంలో.. నార్త్ కొరియా ఈ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తుంది.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్ ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం అనుమానం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా సోమవారం తూర్పు సముద్రం వైపు పేర్కొనబడని బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- అమెరికా సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన కొనసాగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు.
ఉత్తర కొరియా తన ఈశాన్య తీరప్రాంత జలాల్లో అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. కొరియా ద్వీపకల్పంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల మధ్య జనవరి నుంచి ఉత్తర కొరియాకు ఇది ఐదవ పరీక్ష జరిపినట్లు పేర్కొనింది.
నార్త్ కొరియా నిన్న (మంగళవారం) తన పశ్చిమ సముద్రంలోకి అనేక క్రూజ్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా పేర్కొనింది. ఉత్తర కొరియా ఈ నెలలో ఈ తరహా క్షిపణులను పరీక్షించడం ఇది మూడోసారి..
అమెరికా- దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాల చేయడంతో నార్త్ కొరియాకు కోపం తెప్పించింది. దీంతో సౌత్ కొరియా- జపాన్ మధ్య గల సముద్రగర్భంలో అణు దాడి చేసేందుకు అణ్వాయుధ వ్యవస్థను పరీక్షించింది.
దక్షిణ కొరియాతో ఇకపై ఏకీకరణ సాధ్యం కాదని అన్నారు. దక్షిణ కొరియాను ప్రత్యేక 'శత్రువు దేశం'గా మార్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు.