Kim Jong Un: కిమ్ రహస్య ప్రేమికురాలు ఈమేనా..? ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు, ప్రపంచం మొత్తం నియంతగా పిలిచే కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసిన సంచలనమే. స్వీయ నిర్భందంలో ఉండే ఈ దేశంలోని వార్తలు ప్రపంచానికి చాలా వరకు తెలియవు. ఇక కిమ్‌కి సంబంధించిన విషయాలు మరింత రహస్యమే. అయితే, ఇప్పుడు ఓ వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది. కిమ్ జోంగ్ ఉన్‌కి రహస్య ప్రేమికురాలు ఉందని, ఆమె పేరు హ్యోన్ సాంగ్ వోల్ అని వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా జన్మించిందనే వార్తలు ఉన్నాయి.
ఉత్తర కొరియా ప్రీమియర్ గర్ల్ గ్రూప్, మెరన్ బాండ్ బ్యాండ్‌లో నుంచి బయటకు వచ్చిన హ్యోన్ సాంగ్ వోల్ ప్రస్తుతం కిమ్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్నారు. గత వారం రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్‌తో వోల్ కనిపించారు. అయితే, గూఢచారులు మాత్రం వీరిద్దరి మధ్య సంబంధం ప్రొఫెషనల్ కంటే ఎక్కువ అని, వారిద్దరికి బిడ్డ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల వీరిద్దరు కనిపించిన సమయంలో పక్కన ఉన్న సిబ్బంది అంతా నోట్స్ రాసుకుంటుంటే, వోల్ మాత్రం సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసుకోవడం కనిపిస్తోంది.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..

Read Also: PM Modi: ‘‘ అంబేద్కర్ తిరిగి వచ్చినా..’’ రాజ్యాంగంపై ప్రతిపక్షాల ఆరోపణలపై మోడీ ఫైర్..
దక్షిణ కొరియాలోని నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్(ఎన్ఐఎస్)కి చెందిన చోసు-యోంగ్ మాట్లాడుతూ.. వీరిద్దరి బిడ్డకు కిమ్ ఇల్-బాంగ్ అనే పేరు పెట్టారని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ అతని భార్య రిసోల్ జుకి చట్టబద్దమైన కుమారుడు కూడా ఉన్నాడని పేర్కొన్నాడు. అతను ప్రజాజీవితానికి చిన్నగా ఉన్నాడని చెప్పారు. అయితే, కిమ్-వోల్‌కి పుట్టిన కుమారుడు కిమ్ ఇల్ బాంగ్ దృఢంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. కిమ్ జోంగ్ ఉన్ స్విట్జర్లాండ్‌లో చదువుకునేటప్పుడు హ్యూన్ సాంగ్ వోల్‌ని కలిశాడని, ఈమె కిమ్, అతని సోదరి కిమ్ యో జోంగ్‌కి కేర్ టేకర్‌గా చేశారని, ఉత్తర కొరియాకు తిరిగి వచ్చిన తర్వాత వీరిద్దరి బంధం ఏర్పడి కొనసాగిందని చెప్పాడు.
2012 నుంచి దక్షిణ కొరియా నివేదిక ప్రకారం.. కిమ్ తండ్రి కిమో జోంగ్ ఇల్ వీరిద్దరి సంబంధాన్ని అంగీకరించలేదని, విడిపోవాలని ఆదేశించారని, కానీ అతని మరణం తర్వాత కిమ్ సంబంధాన్ని కొనసాగించారని తెలుపుతున్నాయి. నార్త్ కొరియా లీడర్ షిప్ వాచ్ వ్యవస్థాపకుడు మైఖేల్ మాడెన్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో కిమ్ చదువుకుంటున్న తరుణంలోనే వీరిద్దరి మధ్య సంబంధం ఏర్పడి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో వీరిద్దరు కలిసి ఉండొచ్చని అన్నారు. హ్యూన్ కిమ్ కంటే ఏడేళ్లు పెద్దదని అంచనా వేశారు. ప్రస్తుతం ఆమె కిమ్ వ్యక్తిగత సెక్రటేరియట్‌లో పనిచేస్తోంది. అతని షెడ్యూల్, ప్రోటోకాల్, భద్రతా ఏర్పాట్ల వంటి వాటిని సమన్వయం చేస్తుంది. ఉత్తర కొరియా టెలివిజన్ ఈవెంట్లు, మీడియా ప్యాకేజింగ్‌లో ఆమె ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!