Strategic Cruise Missile: నార్త్ కొరియా నిన్న (మంగళవారం) తన పశ్చిమ సముద్రంలోకి అనేక క్రూజ్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా పేర్కొనింది. ఉత్తర కొరియా ఈ నెలలో ఈ తరహా క్షిపణులను పరీక్షించడం ఇది మూడోసారి.. ఈ నెల 24, 28వ తేదీలలో జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల క్రూజ్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది. ఈ నెల 14న ఘన ఇంధనంతో నడిచే మధ్యశ్రేణి క్షిపణిని సైతం నార్త్ కొరియా పరీక్షించింది. ఉత్తర కొరియా దుందుడుకు చర్యల నేపథ్యంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ల త్రివిధ దళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.