Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ ప్యాంగ్‌యాంగ్‌లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతోందన్నారు.
North Korea-Russia: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కోకు మద్దతుగా నార్త్ కొరియా పెద్ద మొత్తంలో సైనిక సాయం అందిస్తుంది. ఈ క్రమంలో కీలక పరిణామం జరిగింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో రష్యా సహజ వనరులు మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ సమావేశం అయ్యారు.
Kim Jong un: ఆత్మాహుతి దాడి డ్రోన్‌లను భారీగా ఉత్పత్తి చేయాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది. దీనికి ఒక రోజు ముందు అతను ఈ ఆయుధ వ్యవస్థ పరీక్షను వీక్షించాడు. ఉత్తరకొరియా మానవరహిత ఏరియల్ టెక్నాలజీ కాంప్లెక్స్ (UATC) తయారు చేసిన భూమి, సముద్ర లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించిన డ్రోన్‌ల పరీక్షలను కిమ్ జోంగ్ ఉన్ వీక్షించారు. ఇందుకు సంబంధించి కొరియన్ సెంట్రల్…
Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భారీ స్థాయిలో సూసైడ్ డ్రోన్‌ల తయారీకి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా కిమ్ డ్రోన్‌ల పరీక్షకు సాక్షిగా మారారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. రష్యా పైకి క్షిపణులు ప్రయోగించడానికి తమ మిత్ర దేశాలు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. రష్యాకు మద్దతుగా మోహరించిన నార్త్ కొరియా సేనలను ధీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులే ప్రయోగించాలన్నారు.
Zelensky: ఉక్రెయిన్‌పై యుద్ధానికి సపోర్టుగా నార్త్ కొరియా రష్యాకు భారీగా సైనికులను తరలిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఉత్తర కొరియా బలగాలు మాస్కో్కి చేరడంపై చైనా మౌనం వహించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశ్నించారు.
US- Russia: రష్యా- ఉత్తర కొరియా ఏం చేస్తున్నాయో గమనిస్తున్నామని యూఎస్ తెలిపింది. ఒకవేళ నార్త్ కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. ఖచ్చితంగా వాళ్లు కూడా తమ లక్ష్యంగా మారతారని అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
దక్షిణ కొరియాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా అప్రమత్తమైంది. తాజాగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి స్థావరాన్ని సందర్శించారు. బాలిస్టిక్ ఆయుధాలను తనిఖీ చేశారు.