ప్రపంచ వ్యాప్తంగా అణ్వస్త్ర ఆయుధాలపై నిషేధం కొనసాగుతున్న వేళ ఉత్తరకొరియా ‘బాంబు’ పేల్చింది. చాలా దేశాలు అణురహితంగా మారుతున్న వేళ కొరియన్ దేశం క్షిపణి పరీక్ష చేసింది. నార్త్ కొరియా అందరీ కంటే దూకుడుగా అణ్వస్త్రం వైపు అడుగులు వేస్తూ ఆసియా ఖండానికే పెనుముప్పుగా మారింది. ఉత్తర కొరియా ఇప్పుడు ఆహార సంక్షోభంతో అల్లాడుతోంది. దేశంలో ఓవైపు కరోనా, విధ్వంసాలు, ఆహార కొరత వంటి పరిస్థితులు పట్టిపీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నార్త్ కొరియా ఆయుధాలను సమకూర్చుకునేందుకు మొగ్గుచూపుతుండటం…
నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ గురించి తెలియని వారుండరు. ఇప్పుడున్న కొద్ది మంది కమ్యూనిస్టు నియంతల్లో ఆయన ఒకరు. పూర్తి పేరు కిమ్ జోంగ్ ఉన్. కరడుగట్టిన డిక్టేటర్ గానే కాదు.. తన లైఫ్ స్టయిల్, పాలనా చర్యలతోనూ తరచూ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటాడు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. చక్కగా ట్రిమ్ చేసిన జుట్టు.. లైట్ కలర్ సూట్‌లో చిన్నారులతో ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. చూస్తే డిక్టేటర్ అని ఎవరూ…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.. ఆయన ఇచ్చే ఆదేశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంటుంది.. ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని దేశాలను కలవరానికి గురిచేస్తుండగా… కోవిడ్ కట్టడానికి అన్ని దేశాలు వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెడుతున్నాయి.. ఈ తరుణంలో కిమ్ షాకింగ్ ప్రకటన చేశారు.. కోవిడ్ వ్యాక్సిన్ తమకు అవసరం లేదని ప్రకటించారు.. దీనికి బదులుగా తమదైన శైలిలో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయాలంటూ అధికారులకు…
ప్రపంచంలో మహమ్మారి కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కరోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. వ్యాక్సిన్ కోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవాక్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్ ద్వారా ప్రపంచంలోకి పేద, మద్యతరగతి దేశాలకు వ్యాక్సిన్‌లను అందిస్తోంది. అయితే, కోవాక్స్‌లో భాగంగా ఉత్తర కొరియాకు 30 మిలియన్ డోసుల సీనోవ్యాక్ డోసులు అందించేందుకు కోవాక్స్ ముందుకు రాగా, దానిని ఉత్తర కొరియా తిరస్కరించింది. తమకు ఆ వ్యాక్సిన్ డోసులు…
ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం ఇంకా ముగియకముందే ఇప్పుడు అమెరికాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఉత్తర కొరియా ఇప్పుడు మళ్లీ అణు సమస్యలు తెచ్చిపెట్టేందుకు సిద్ధం అయింది. అణు రియాక్టర్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చినట్టు ఐక్యరాజ్యసమితి అటామిక్ ఏజెన్సీ పేర్కొన్నది. ఇది అంతర్జాతీయ అణుచట్టాలకు విరుద్ధమని ఐరాస పేర్కొన్నది. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తో సమావేశానికి ముందు యాంగ్‌బ్యోన్‌లోని అణు రియాక్టర్‌ను…
ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్ గురించిన ఏ చిన్న వార్త అయినా ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ప్రపంచానికి ఎలాంటి చేటు తీసుకొస్తారో అని భయపడుతుంటారు. గత ఏడాది నుంచి అనేకమార్లు కిమ్ ప్రపంచానికి, మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన అలా దూరంగా ఉన్నన్ని రోజులు ప్రపంచంలో తెలియని భయం నెలకొనేది. కిమ్ ఆరోగ్యం బాగాలేదా, లేదంటే రహస్యంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేదా అసలు కిమ్ ఉన్నారా…
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొన్ని నెలల క్రితం రెండు దేశాల మధ్య ఏర్పాటు చేసిన హాట్‌లైన్‌ను ధ్వంసం చేశారు. మరోసారి కొరియా యుద్ధం తప్పదేమో అన్నంతగా పరిణామాలు మారిపోయాయి. అయితే, నెల రోజుల క్రితం నుంచి క్రమంగా మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లో ద్వంసం చేసిన కార్యాలయాలను తిరిగి ఏర్పాటు చేశారు. ఇరుదేశాల అధినేతలు హాట్‌లైన్‌లో మూడుసార్లు చర్చించుకున్నారు. కొరియా మధ్య సయోధ్య కుదిరితే బాగుంటుందని అందరూ అనుకున్నారు. …
2018 వరకు అంతంత మాత్రంగానే ఉన్న ఉభయ కొరియాల మధ్య సంబంధాలు, ఆ తరువాత కాస్త మెరుగుపడ్డాయి. ఇరు దేశాల అధినేతలు మూడుసార్లు భేటీ అయ్యారు. సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు ఉభయ కొరియా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తాను మధ్యవర్తిగా వ్యవహరిస్తానని చెప్పడంతో వియాత్నం వేదికగా ఉత్తర కొరియా, అమెరికా దేశాధినేతల సమావేశం జరిగింది. అయితే, ఈ చర్చలు విఫలం కావడంతో దాని ప్రభావం ఉభయ కొరియాల మధ్య సంబంధాలపై…
ఉత్తర కొరియాలో నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించకుంటే శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. అయితే గత కొంతకాలంగా దక్షిణ కొరియా కల్చర్‌ను ఉత్తర కొరియా యువత ఫాలో అవుతున్నది. దక్షిణ కొరియా స్టైల్‌ను, ఫ్యాషన్‌ను, వారు మాట్లాడే విధంగా మాట, యాసలు అలవరుచుకుంటున్నారు. ఇలా చేయడం వలన ఉత్తర కొరియా సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతింటాయని, యువత పక్కదోవ పడుతున్నారని భావించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ…
ఉత్తర కొరియాలో అక్కడి నియమాలకు విరుద్దంగా ఏం చేసినా కఠినమైన శిక్షలు విధిస్తారు. ప్రభుత్వం ఎలా చెబితే అక్కడి ప్రజలు అలా నడుచుకోవాల్సిందే. అతిక్రమించి ఎవరూ కూడా అక్కడ బతికి బట్టకట్టలేరు. తినే ఆహారం దగ్గర నుంచి, కట్టుకునే బట్ట వరకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఉండాలి. బట్టల విషయంలో కిమ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్వవహరిస్తుంది. Read: వైరల్ః బర్త్‌డే పార్టీకి ఆ సింహమే చీఫ్ గెస్ట్…నెటిజన్లు ఆగ్రహం కొరియా సంస్కృతికి విరుద్ధంగా ప్రజలు…