నవ్వుపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి.. నవ్వని వాడు మనిషే కాదు అని ఎందరో అంటే.. నవ్వు నాలుగు విధాలుగా చేటు అనేవారు కూడా లేకపోలేదు.. అయితే, ఆ నవ్వు గోల ఎలా ఉన్నా.. సంచలన నిర్ణయాలకు వేదికైన ఉత్తర కొరియా.. తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. ఆ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో నవ్వడం నిషేధం విధించింది.. ఇవాళ్టి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.. కేవలం నవ్వడంపై మాత్రమే కాదు మద్యం సేవించడం, సరుకులు కొనేందుకు షాపింగ్‌కు వెళ్లడం, విశ్రాంతి కార్యక్రమాల్లో పాల్గొనడంపై కూడా నిషేధం విధించారు అధికారులు.. ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉండనుండగా.. ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏ కారణం లేకుండా నిర్ణయం తీసుకోరు కదా.. దీనికి ముఖ్యకారణం మాత్రం.. ఆ దేశ మాజీ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ II… ఆయన భౌతికంగా దూరంగా పదేళ్లు గడించింది.. ఆయన 10వ వర్ధంతి సందర్భంగా 10 రోజుల పాటు నవ్వకుండా నిషేధం విధించారు ఉత్తర కొరియా అధికారులు.
Read Also: ఆర్టీసీ బస్సు ప్రమాదం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
ఇక, గతంలో, సంతాప సమయంలో మద్యం సేవించి లేదా మత్తులో పట్టుబడిన చాలా మందిని అరెస్టు చేసి సైద్ధాంతిక నేరస్థులుగా పరిగణించిన సందర్భాలు ఉన్నాయి.. ఈ సంతాప సమయంలో, అంత్యక్రియల ఆచారాలు లేదా సేవలు లేదా పుట్టినరోజులను జరుపుకోవడానికి కూడా ఎవరికి అనుమతించరు. మరోవైపు.. కిమ్ జోంగ్ II వర్ధంతి సందర్భంగా ఉత్తర కొరియా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్లాన్ చేసింది.. ఆ నేత ఫోటోగ్రఫీ మరియు కళ యొక్క బహిరంగ ప్రదర్శన, కచేరీ, ఆయన పేరు పెట్టబడిన ‘కిమ్‌జోంగిలియా’ అనే పుష్పం ప్రదర్శన ఉన్నాయి.