ప్రపంచ వ్యాప్తంగా అణ్వస్త్ర ఆయుధాలపై నిషేధం కొనసాగుతున్న వేళ ఉత్తరకొరియా ‘బాంబు’ పేల్చింది. చాలా దేశాలు అణురహితంగా మారుతున్న వేళ కొరియన్ దేశం క్షిపణి పరీక్ష చేసింది. నార్త్ కొరియా అందరీ కంటే దూకుడుగా అణ్వస్త్రం వైపు అడుగులు వేస్తూ ఆసియా ఖండానికే పెనుముప్పుగా మారింది. ఉత్తర కొరియా ఇప్పుడు ఆహార సంక్షోభంతో అల్లాడుతోంది. దేశంలో ఓవైపు కరోనా, విధ్వంసాలు, ఆహార కొరత వంటి పరిస్థితులు పట్టిపీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నార్త్ కొరియా ఆయుధాలను సమకూర్చుకునేందుకు మొగ్గుచూపుతుండటం…