Amaravati Capital Construction: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతమైంది. రాజధానిలో ఐకానిక్ భవనంగా నిర్మించనున్న హైకోర్టు భవనానికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ (Raft Foundation) పనులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లతో కలిసి రాఫ్ట్ ఫౌండేషన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.…