Grama Sabalu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి అమలు చేయబోయే నాలుగు ముఖ్యమైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. గతంలో అందిన దరఖాస్తుల ఆధారంగా ఫీల్డ్ సర్వే బృందాలు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారి వివరాలను సేకరించి, అర్హుల జాబితాను రూపొందించి సంబంధిత అధికారులకు అందించారు. ఈ జాబితాలను గ్రామ, వార్డు స్థాయి సభల్లో బహిరంగంగా చదవనున్నారు. జాబితాలో ఉన్న పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, ఆయా అభ్యంతరాలను స్వీకరించేందుకు…