Kavitha: గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపునకు గురైన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. నిజామాబాద్ జాగృతి కవిత మీడియా సమావేశం నిర్వహించారు. అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రస్తుత మంత్రి తుమ్మల వల్లే ముంపు ముప్పు ఉందని తెలిపారు. మొక్క రైతులకు బోనస్ చెల్లించి, కొనుగోలు కేంద్రాలు తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం తడిసింది, తడిసిన ధాన్యం కడ్తా లేకుండా కొనుగోలు చేయాలన్నారు. బీజేపీ ఎంపీ ఉన్నా.. లేనట్టే అని విమర్శించారు. మాధవనగర్ బ్రిడ్జి పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు ఎంపీ అరవింద్ చెప్పాలన్నారు. ఎంపీ అరవింద్ రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుందన్నారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తేనే బీసీ బిల్లుకు మోక్షం లభిస్తుంది.. బీజేపీ ఎంపీ తన కుటుంబం ఎంపీ లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చిట్టా బయట పెడతా అని పేర్కొన్నారు.
READ MORE: Priya Prakash : బాలీవుడ్ పై కన్నేసిన మలయాళ బ్యూటీ