MLC Kavitha : నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, అందుకే మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారన్నారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారని, కానీ ఇప్పుడు మైనారిటీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న కాంగ్రెస్ అని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మతకల్లోలాలు జరిగాయన్నారు ఎమ్మెల్సీ కవిత అన్నారు. మతకల్లోలాలను నిరోధించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.? అని ఆమె ప్రశ్నించారు.
Jyothula Nehru: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
గంగాజమునా తెహజీబ్ లా ఉన్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారని, మైనారిటీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ఆమె ఆరోపించారు. మైనారిటీ డిక్లరేషన్ అమలు ఏమైంది ? అని ఆమె అన్నారు. మైనారిటీ డిక్లరేషన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని, మైనారిటీలకు కేటాయించిన బడ్జెట్ లో కనీసం 25 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. 3000 వేల కోట్లు కేటాయించి కేవలం 700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, షాదీ ముబారక్ కింద రూ. 1.6 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లో తబ్లిఖీ జమాత్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.
Thammineni Veerabhadram : ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామ సభలోనే జరగాలి