చూడగానే బాగా పరిచయమున్న అమ్మాయిలా అనిపిస్తుంది నివేదా థామస్. భూమికి కొంతే ఎత్తున ఉంటుంది. అందుకని మేకప్ భలేగా మెత్తదు. అలాగని ఆమెను చూసినా మొహం మొత్తదు. ఆమెలో ఏదో ఆకర్షణ దాగుంది. ఆ మోములోనే పలు భావాలు పలికించగల నేర్పూ ఉంది. మళయాళ సీమకు చెందిన ఈ పుష్పం, తెలుగు చిత్రసీమలోనూ తనదైన అభినయంతో సువాసనలు వెదజల్లింది. పలు భాషల్లో పరిణతి చెందిన నటిలా రాణిస్తోంది. నివేదా థామస్ 1995 నవంబర్ 2న చెన్నైలో జన్మించింది.…