అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని నితీషా కందుల(23) క్షేమంగా ఉన్నట్లు యూఎస్ పోలీసులు తెలిపారు. మే 28న నితీషా అదృశ్యమైంది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలోని శాన్ బెర్నార్డినోలో ఆమె మాస్టర్స్చేస్తోంది. ఆమె ఆచూకీ కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.