Union minister Piyush Goyal criticizes CM KCR: కేసీఆర్ రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. నీతి ఆయోగ్ రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని.. ఎజెండా తయారీలో రాష్ట్రాల భాగస్వామ్యం ఉండటం లేదని.. సహకార సమాఖ్య విధానంలో నీతి ఆయోగ్ వ్యవహరించడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ సమావేశం ముఖ్యమంత్రులు మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.