భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.. నాసాతో కలిసి కీలక ప్రయోగానికి రెడీ అయ్యింది.. రేపు జీఎస్ఎల్వీ - ఎఫ్ 16 రాకెట్‌ను ప్రయోగించనుంది.. దీని కోసం ఇవాళ మధ్యాహ్నం 2.10 గంటలకి కౌంట్ డౌన్‌ను ప్రారంభించనుంది.. కౌంట్‌డౌన్ ప్రక్రియ పూర్తి చేసి.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండో లాంచ్ పాడ్ నుంచి రేపు సాయంత్రం 5.40 గంటలకి ప్రయోగాన్ని చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు..
NISAR: భారత్, అమెరికా కలిసి సంయుక్తంగా తయారు చేసిన ‘ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ అయిన ‘‘’NASA ISRO సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) శాటిలైట్’’ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సాంకేతిక అద్భుతం, గేమ్ ఛేంజర్‌గా మారుతుందని చెబతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు నుంచి ప్రాణాలను కాపాడేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. 1.3 బిలియన్ డాలర్ల పైగా ఖర్చుతో భారత్, అమెరికాలు కలిసి ఈ శాటిలైట్‌ని రూపొంందించాయి. భారత్ లోని శ్రీహరికోట లాంచింగ్ సెంటర్ నుంచి ఈ…