Parliament: నిర్మలా సీతారామన్‌ని ‘‘మాతా జీ’’గా పిలిచిన ఖర్గే.. ధన్‌ఖర్ రిప్లైతో రాజ్యసభలో నవ్వులు..
- నిర్మలా సీతారామన్‌ని ‘ మాతా జీ’ అని పిలిచిన ఖర్గే..
- ఆమె మీకు కూతురు లాంటిదన్న ధన్‌ఖర్..
- వాడీ వేడి చర్చ మధ్యలో రాజ్యసభలో నవ్వులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament: బడ్జెట్ చర్చ సందర్భంలో రాజ్యసభలో ఫన్నీ సందర్భం ఎదురైంది. వాడీ వేడి చర్చ మధ్యలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేపై వేసిన సెటైర్లతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంలో ఈ ఘటన ఎదురైంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బీహార్, ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల ప్లేట్లు ఖాళీగా ఉన్నాయని అన్నారు.
నిన్న సమర్పించిన బడ్జెట్‌లో ఏపీ, బీహార్‌కి తప్ప మారే రాష్ట్రానికి ఏం లభించలేదని, ఆ రాష్ట్రాల ప్లేట్లలో పకోడీ, జిలేబీ వడ్డించారని ఖర్గే అన్నారు. తాను ఇలాంటి బడ్జెట్‌ని ఎప్పుడూ చూడలేదని, ఈ బడ్జెట్ బీజేపీ తన కుర్చీని కాపాడుకునేందుకు మాత్రమే అని, దీన్ని ఖండిస్తున్నానని చెప్పారు. దీనిపై స్పందించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని అనుమతించాలని ఖర్గేని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ కోరారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఈ సమయంలో ఖర్గే ‘‘ నన్ను పూర్తిచేయనివ్వండి, మాతాజీ మాట్లాడటంతో నిపుణులని అందరికి తెసులు’’ అంటూ నిర్మలా సీతారామన్‌ని ఉద్దేశించి అన్నారు. దీనికి ధన్‌ఖర్ రిప్లై ఇస్తూ ‘‘ మాతాజీ కాదు, ఆమె మీకు కూతురు లాంటిది’’ అనడంతో ఒక్కసారిగా అధికార, ప్రతిపక్ష ఎంపీలు నవ్వారు. ఖర్గే ఆరోపణలపై స్పందించిన ఆర్థిక మంత్రి.. తాము బడ్జెట్‌లో ఏ రాష్ట్రాన్ని కూడా విస్మరించలేదని ఆమె అన్నారు. ప్రతీ బడ్జెట్లో అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించలేమని చెప్పారు. ఉదాహరణకు మహరాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలో వంధవన్ అనే పట్టణంలో ఓడరేవు ఏర్పాటు చేయాలని భావించామని, అయినప్పటికీ మహారాష్ట్ర పేరును ప్రస్తావించలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. పేరు చెప్పకపోయినంత మాత్రనా మహారాష్ట్ర విస్మరించబడుతోందని అర్థం కాదని చెప్పారు.
मोदी सरकार के बजट में किसी भी राज्य को कुछ नहीं मिला।
जिस-जिस राज्य में लोगों ने भाजपा को नकारा है, उस राज्य को इस बजट से कुछ नहीं मिला !
सबकी थाली ख़ाली, और दो राज्यों की थाली में "पकोड़ा" और "जलेबी" !
ये बजट सिर्फ़ अपनी कुर्सी बचाने के लिए लाया गया है।
वित्त मंत्री… pic.twitter.com/4OPJyIyvOL
— Mallikarjun Kharge (@kharge) July 24, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!