'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి బుధవారం నాడు సాయంత్రం పర్యటించారు. ముందుగా హనుమాన్ జంక్షన్ కు విచ్చేసిన భువనేశ్వరికి యార్లగడ్డ వెంకట్రావ్ దంపతులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.
Nara Bhuvaneswari’s Nijam Gelavali Yatra Schedule Today: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి మూడు రోజుల పర్యటన నేటితో ముగియనుంది. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అనపర్తి, నిడదవోలు, కోవ్వూరు, గోపాలపురం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో పర్యటిస్తారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించిన సమయంలో వేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి..…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు.