దర్శక దిగ్గజం రాజమౌళి అర్ధరాత్రి చార్మినార్ లో సందడి చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అనుకోకుండా ఆ సమయంలో, అలా రాజమౌళి కనిపించే సరికి జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రంజాన్ మాసం కావడంతో పాతబస్తీలో నైట్ బజార్ ప్రారంభమైంది. హైదరాబాదీలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు పాతబస్తీ, పరిసర ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓల్డ్ సిటీలోని నైట్ బజార్ లో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కన్పించారు.…