నైజీరియాలో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. గురువారం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు భారీ వరదలు ముంచెత్తాయి. పైగా డ్యామ్ కూలిపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.
ఆఫ్రికా దేశమైన నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల పలు పట్టణాలు, గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి.