భారతదేశంలోని క్రిమినల్ సిండికేట్‌లు, ఖలిస్థానీ వేర్పాటువాదులు, పాకిస్తాన్, కెనడా వంటి దేశాలలో ఉన్న ఉగ్రవాదుల మధ్య అనుబంధంపై ఎన్‌ఐఏ పలు రాష్ట్రాల్లో అణిచివేతను ప్రారంభించింది. దేశంలో ఖలిస్థానీలు, గ్యాంగ్‌స్టర్ల మధ్య సంబంధాలు ప్రమాదకరంగా మారుతున్నాయి.
ఉగ్రవాద కుట్ర కేసులో దక్షిణ కశ్మీర్‌లోని ఐదు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం సోదాలు నిర్వహించింది. ఈ ఏడాది మేలో జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్, షోపియాన్, పుల్వామా, శ్రీనగర్, అనంత్‌నాగ్ జిల్లాల్లోని 13 ప్రాంతాల్లో కూడా ఎన్‌ఐఏ భౌతిక, సైబర్‌స్పేస్ ద్వారా ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నిన కేసులో సోదాలు నిర్వహించింది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా తహసీల్ ఆమ్లాలో ఆదివారం ఎన్‌ఐఏ దాడులు కలకలం సృష్టించాయి. ముంబైలో పనిచేస్తున్న ఓ పెయింటర్ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. పెయింటర్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసులతో కలిసి ఎన్‌ఐఏ బృందం దాడులు చేసింది. పెయింటర్ తౌహీద్‌కు పాకిస్థాన్ యువకుడితో సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లోని ఆరు రాష్ట్రాల్లోని 100కి పైగా సోదాలు నిర్వహించింది. వివిధ ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్‌స్టర్‌లకు, డ్రగ్స్ స్మగ్లింగ్ మాఫియాకు ఉన్న సంబంధాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్‌లలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఈ కేసు పాకిస్థాన్ కమాండర్లు లేదా హ్యాండ్లర్ల ఆదేశానుసారం వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపులు, టెర్రర్ ఫండింగ్, నేరపూరిత కుట్రకు సంబంధించినది.
గ్యాంగ్‌స్టర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. గ్యాంగ్‌స్టర్లు, టెర్రర్ గ్రూపులు, డ్రగ్స్ మాఫియా మధ్య సంబంధానికి సంబంధించిన కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఎనిమిది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోందని అధికారులు తెలిపారు.
ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్న అనుమానితులపై భారీ అణిచివేతలో భాగంగా ఈరోజు కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
NIA raids 56 places in Kerala linked to PFI leaders, members: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. గురువారం ఉదయం నాలుగు గంటల నుంచే కేరళ వ్యాప్తంగా రైడ్స్ చేస్తోంది. పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు నిర్వహిస్తోంది. మొత్తం 56 చోట్ల ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఇటీవల పీఎఫ్ఐని భారత ప్రభుత్వం నిషేధించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పాటు అక్రమ నిధులు కేసులో…
గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాద ముఠాలకు మధ్య ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మంగళవారం ఎన్ఐఏ అధికారులు దాడులు జరిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
కోయంబత్తూరు కారు బ్లాస్ట్ కేసులో విచారణ వేగవంతం చేసింది ఎన్‌ఐఏ.. అర్ధరాత్రి నుంచి 150 మంది అధికారులతో 45 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్నారు..