దేశంలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. క్లబ్స్, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లలో 50% కెపాసిటీతోనే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని, డీజేకు అనుమతి లేదని స్పష్టం చేసింది. టీకా తీసుకోని వారికి వేడుకల్లో పాల్గొనేందుకు పర్మిషన్ ఉండదని తెలిపింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2022 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. Read Also: 20 యూట్యూబ్…
దేశంలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. జనవరి నాటికి ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతాయని ఇప్పటికే పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ విధిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల వేళ ఒమిక్రాన్ వేరియంట్ మరింతమందికి సోకుతుందనే ఉద్దేశంతో డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీన రెండు రోజుల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుందని…