మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ప్రజలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. కష్టాలను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తామని కేసీఆర్ తెలిపారు. వినూత్న పంథాలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. Read Also: రేపటి నుంచి నుమాయిష్ ప్రారంభం మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు…
భారత్ లో మరికొన్ని గంటల్లో నూతన సంవత్సర ఘడియలు రానుండగా, 2022 ఏడాదికి పసిఫిక్ ద్వీప దేశాలు ప్రపంచంలో అందరికంటే ముందు స్వాగతం పలికాయి. పసిఫిక్ మహాసముద్రంలోని సమోవా దీవి ప్రపంచంలో అందరికన్నా ముందు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించింది. టోంగా, కిరిబాటి దీవులతో పాటు న్యూజిలాండ్ కూడా 2022కు ఘనంగా స్వాగతం పలికింది. Read Also:APSRTC ఉద్యోగులకు న్యూ ఇయర్ కానుక న్యూజిలాండ్ లోని పలు నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి. రంగురంగుల బాణసంచా వెలుగులతో…
ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరం వేడుకలు మొదట న్యూజిలాండ్‌లో ప్రారంభం అయ్యాయి. న్యూజిలాండ్ రాజధాని అక్లాండ్‌లో కొత్త సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టాలని, మళ్లీ పూర్వం రోజులు రావాలని, ప్రపంచంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని ప్రజలు కోరుకుంటూ సంబరాలు చేసుకున్నారు. Read: విమానంలో ప్రయాణం చేస్తున్న మహిళకు కరోనా……
నూతన సంవత్సర వేడుకలకు అంతా సిద్ధమవుతున్న సమయంలో.. మంద్య షాపులు, బార్లకు కాస్త వెలసుబాటు కల్పిస్తూ.. మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మద్యం విక్రయాల సమయం గంట సేపు పొడిగించింది.. రాష్ట్రంలోని బార్లు, రీటైల్ మద్యం దుకాణాలు, ఇన్ హౌస్సులో మద్యం విక్రయాల సమయంలో వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… డిసెంబర్ 31 అర్ధరాత్రిలో మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.. ఈవెంట్స్ తో పాటు పర్యాటక లైసెన్సులు కలిగిన హోటళ్లల్లో…
సౌత్ స్టార్ హీరోయిన్ ఈ ఏడాది హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన హీరోయిన్లలో ఒకరు. సామ్ ఇప్పుడు నూతన సంవత్సరం 2022ని స్వాగతించడానికి ఉత్సాహంగా ఉన్నారు. 2021లో సమంత మొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ విడుదలై సంచలనం సృష్టించింది. తరువాత ఈ ఏడాది అక్టోబర్ లో ఆమె విడాకుల కారణంగా చాలా రోజులు వార్తల్లో నిలిచింది. అనంతరం ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేయడమే కాకుండా ‘పుష్ప’లోని ఐటమ్ సాంగ్…
తెలంగాణ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది… ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతోన్న ఆర్టీసీ.. ఇప్పుడు న్యూఇయర్ కానుకగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. కొత్త సంవత్సరం గిఫ్ట్‌గా.. అంటే 2022 జనవరి 1వ తేదీన.. తల్లిదండ్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది ఆర్టీసీ.. Read Also: మొరాయించిన రవాణాశాఖ సర్వర్.. ట్యాక్స్‌పై క్లారిటీ…
న్యూ ఇయర్ వేడుకల సమయంలో గుడ్‌న్యూస్ చెప్పింది టీఎస్‌ఆర్టీసీ.. కొత్త సంవత్సర వేడుకలకు అదనపు బస్సు సర్వీసులను నడపనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వారికోసం ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసీ.. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రత్యేకంగా నడపనున్నారు.. అయితే, ఒక్కరికి 100 రూపాయల చార్జ్ చేయనున్నట్టు వెల్లడించారు.. ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.. Read Also: ఏపీ:…
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.. న్యూ ఇయర్ నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.. కోవిడ్, నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2వ తేదీ వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్న ఆయన.. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలు అమలు చేయాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఇక, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు…
న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సహ కొన్ని నగరాల్లో కోవిడ్ దృష్ట్యా కొన్ని ఆంక్షలు విధించింది. తాజాగా విశాఖనగరంలోనూ కూడా ఆంక్షలు విధిస్తున్నట్టు సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. వేడుకలకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. డిసెంబర్ 31న యారాడ నుండి భీమిలి వరకు బీచ్ రోడ్ సాయంత్రం 6 గంటలకు మూసివేయనున్నట్టు తెలిపారు. Read Also:రైతులకు మోడీ సర్కార్ శుభవార్త నగర పరిధిలో ఉన్న ఫ్లైఓవర్‌లను కూడా సాయంత్రం 6 గంటల…
ఓవైపు డిసెంబర్ 31వ తేదీతో పాటు జనవరి 1వ తేదీన వైన్ షాపులు, పబ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తే.. మరోవైపు.. హైదరాబాద్ పోలీసులు మాత్రం న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.. న్యూ ఇయర్ వేడుకలపై విధించిన ఆంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్ పోలీస్ కొత్త బాస్ సీవీ ఆనంద్ ఓ ప్రకటన విడుదల చేశారు. న్యూ ఇయర్‌పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేసిన ఆయన.. పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి…