సమంత న్యూఇయర్ సెలబ్రేషన్ ప్లాన్ ఇదేనట !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ ఈ ఏడాది హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన హీరోయిన్లలో ఒకరు. సామ్ ఇప్పుడు నూతన సంవత్సరం 2022ని స్వాగతించడానికి ఉత్సాహంగా ఉన్నారు. 2021లో సమంత మొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ విడుదలై సంచలనం సృష్టించింది. తరువాత ఈ ఏడాది అక్టోబర్ లో ఆమె విడాకుల కారణంగా చాలా రోజులు వార్తల్లో నిలిచింది. అనంతరం ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేయడమే కాకుండా ‘పుష్ప’లోని ఐటమ్ సాంగ్ తో అందరినీ అదరగొట్టేసింది. వచ్చే ఏడాది కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ గంటలు లెక్కబెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెలెబ్రిటీలు ఏ విధంగా న్యూఇయర్ ను సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు ? అనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. అందరి లాగే సామ్ కూడా న్యూఇయర్ సెలెబ్రేషన్స్ ను ఎలా చేసుకోబోతోంది ఓ నేషనల్ మీడియాకు వెల్లడించింది.
సమంతా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ న్యూఇయర్ రోజు తన సన్నిహితులతో గడపాలని ఎదురు చూస్తున్నానని తెలిపింది. ఆమె మాట్లాడుతూ “ఏడాది పొడవునా నన్ను హ్యాపీగా ఉంచిన గొప్ప స్నేహితులు నాకు ఉన్నారు. కాబట్టి నేను వారితో, నా కుక్కలతో, ముఖ్యంగా నా తల్లితో సమయం గడపాలని ఎదురు చూస్తున్నాను. ఈ సంతోషకరమైన సమయంలో వారితో గడపడం అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. కాగా సమంత ఇప్పటికే తన తరువాత చిత్రం ‘శాకుంతలం’ షూటింగ్‌ను ముగించింది. త్వరలో విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సామ్ టైటిల్ రోల్ పోషిస్తోంది. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించిన ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’లో కూడా సమంత కనిపించనుంది. అంతే కాకుండా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే ప్రాజెక్ట్‌లో నయనతార, విజయ్ సేతుపతితో పాటు సమంత కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది ఫిబ్రవరి 2022లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!