33 సంవత్సరాల విక్కీ కౌశల్, 38 యేళ్ళ కత్రినా కైఫ్ ను గత యేడాది డిసెంబర్ 9న పెళ్ళి చేసుకున్నాడు. వివాహానంతరం కొంతకాలం వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిచ్చిన ఈ బాలీవుడ్ జంట ఇప్పుడు తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న సినిమాలో విక్కీ కౌశల్ చోటు సంపాదించుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ మూవీలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ లోని…
యంగ్ డైరెక్టర్ పన్నా రాయల్ దర్శకత్వంలో హేసన్ పాషా నిర్మిస్తున్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఇంటి నెం.13’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అలాగే ఇటీవల ఈ సినిమా కోసం శ్రీయా ఘోషల్ పాడిన ‘పో పోవే…’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ‘ఇంటి నెం. 13’ చిత్రంలోని మరో…
ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడిగా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ రెండవ చిత్రమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన విషయం విదితమే. ఆర్ఆర్ఆర్ పోస్టుపోన్ కావడంతో దాన్ని పక్కన పెట్టేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో రెండో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇది కాకుండా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోరు పెంచేస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే 8 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా.. పాన్ ఇండియా మూవీలు ‘సలార్, ‘ఆది పురుష్’, ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’ వంటి పెద్ద ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజగా వీటితో పాటు మూడు సినిమాలను ప్రభాస్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం బట్టి ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ…
ఇవాళ యువ కథానాయకుడు నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న సినిమా పేరును నిర్మాత ఉషా ముల్పూరి ఖరారు చేశారు. అనీశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘కృష్ణ వ్రింద విహారీ’ అనే పేరు పెట్టారు. కృష్ణ, వ్రింద మధ్య సాగే ప్రణయ ప్రయాణమే ఈ సినిమా. ఈ చిత్రంతో షిర్లే సేతియా కథానాయికా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రాధిక, ‘వెన్నెల’కిశోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ,…
హీరోగానూ, స్టార్ కమెడియన్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘యజ్ఞం’, ‘పిల్లా… నువ్వు లేని జీవితం’ వంటి విజయవంతమైన సినిమాలు తీసిన ఎ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సప్తగిరి ఓ సినిమా చేయబోతున్నాడు. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఎ. ఎస్. రిగ్వేద చౌదరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. నిర్మాత ఎ.ఎస్. రిగ్వేద చౌదరి మాట్లాడుతూ “వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న…
న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘బేబీ’. దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘బేబీ’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ, ”ఇదో నేచురల్, ఇన్నోవేటివ్ లవ్ స్టోరీ. ఈ సినిమా ఫ్లేవర్ ను రిఫ్లెక్ట్ చేస్తూ ఒక కొత్త తరహా పోస్టర్…
అక్కినేని నాగ చైతన్య- సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విడాకులు తరువాత కూడా స్నేహితులుగానే ఉంటామని చెప్పిన ఈ జంట ఇప్పటివరకు ఒక్కసారిగా కలిసినట్లు గానీ, మాట్లాడుకున్నట్లు కానీ సమాచారమే లేదు. అయితే వీరి విడాకుల వలన ఎవరు ఎంత నష్టపోయారు అనేది తెలియదు కానీ టాలీవుడ్ లో ఒక లేడీ డైరెక్టర్ మాత్రం తీవ్ర నష్టపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ లేడీ డైరెక్టర్ ఎవరో కాదు నందినీ రెడ్డి. సామ్…
రానా కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఘాజీ’తో ఉత్తరాది వారికీ పరిచయం అయ్యాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఆ తర్వాత అతను రూపొందించిన ‘అంతరిక్షం’ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసింది. అయితే సంకల్ప్ రెడ్డిలోని ప్రతిభను బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ గుర్తించాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించడంతో పాటు చిత్ర నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు విద్యుల్ జమ్వాల్. అదే ‘ఐబి 71’. 1971లో జరిగిన ఇండో పాక్ వార్ నేపథ్యంలో ఇంటెలిజెన్ బ్యూర్ పాత్రను తెలియచేసే…
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. సోమవారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి టీమ్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ‘కలర్ ఫొటో’ మూవీ తో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.…