మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగిన లఖ్‌పతి దీదీ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు.
New Criminal Laws: నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తుండటంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
హిట్ అండ్ రన్ కేసులపై కొత్త శిక్షాస్మృతిని వ్యతిరేకిస్తూ ఇవాళ్టి నుంచి 48 గంటల సమ్మెకు అస్సాం ట్రాన్స్‌పోర్టర్ యూనియన్లు పిలుపునిచ్చింది. దీని కారణంగా అస్సాంలో అన్ని వాణిజ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది.
ఇండియన్ పీనల్ కోడ్ (IPC), ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సాక్ష్యాధారాల చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త బిల్లులను ఆమోదించింది. వచ్చే వారం పార్లమెంట్‌లో మూడు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 11న హోంమంత్రి అమిత్ షా.. 163 ఏళ్ల నాటి మూడు ప్రాథమిక చట్టాలను సవరించే బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC), ఎవిడెన్స్ యాక్ట్. కొత్త…