Central Bank Of India Recruitment: ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం చూస్తున్న ఐటీ స్పెషలిస్ట్‌లకు శుభవార్త. ఎందుకంటే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ గురించి సమాచారాన్ని పొందడానికి మీరు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ centralbankof india.co.in కి వెళ్లి కెరీర్ ఎంపికకు వెళ్లాలి. నోటిఫికేషన్‌ను చదివిన తర్వాత, మీరు రిక్రూట్‌మెంట్ ఎంపికకు వెళ్లి , కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేసి,…
EPFO : దేశంలో ఉద్యోగాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. EPFO గణాంకాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి. ఆదివారం విడుదల చేసిన EPFO డేటా ప్రకారం, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, పదవీ విరమణ నిధిని నిర్వహించే సంస్థ, జనవరి 2024లో మొత్తం 16.02 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది.
పండుగల సీజన్ మొదలైంది.. వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి.. దాంతో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ కూడా తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు.. కొద్ది రోజుల క్రితం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లక్ష ఉద్యోగులను నియమించడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ క్రమంలో మీషో కూడా 5 లక్షల ఉద్యోగాలను నియమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. రాబోయే పండుగ సీజన్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి…
తెలంగాణలో యువత ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా వుంటే 80 వేల ఉద్యోగాలే భర్తీచేయడం ఏంటని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి విపక్షాలు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన రీతిలో విమర్శలు చేస్తున్నారు. 2004 – 14 వరకు ఉద్యమం లో యువత పెద్దన్న పాత్ర. 2014 – 22 వరకు ఉద్యోగాల కోసం యువత ఆశగా చూసారు. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో నిరుద్యోగులు, యువత వ్యతిరేకంగా…
తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలతోనే నిరుద్యోగ నిర్మూలన సాధ్యంకాదు. ఒకేసారి ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది. రాష్ట్ర…
తెలంగాణ ఉద్యమం, అనంతరం తెలంగాణ సాధన విషయాలను తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మరోమారు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం.. తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో నేనూ కూడా లాఠీదెబ్బలు తిన్నా.. వివక్ష, అన్యాయంతో తెలంగాణ నలిగిపోయిందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో వేరే పార్టీలకు రాజకీయాలంటే ఓ గేమ్.. కానీ టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఓ టాస్క్. ఈ రోజు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు.. ఒకప్పుడు…
తెలంగాణలో నిరుద్యోగం ఇప్పుడు పార్టీలో ఏజెండాగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చర్చిస్తోంది. లక్షలాది ఉద్యోగాల నియామకం చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చాలీచాలని జీతాలతో ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన పలువురు నిరుద్యోగులు ఉద్యోగాలు రాక హమాలీ పనికి, టీ, టిఫిన్ సెంటర్లు నడుపుతూ, కూరగాయలు…
మార్చి నెల వచ్చేస్తోంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి నెలరోజులవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కసరత్తు చేస్తోంది. 2022- 23 రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారుచేయడానికి సీఎం కేసీఆర్.. ప్రగతిభవన్‌లోఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహా అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.…