Meesho: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..5 లక్షల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగల సీజన్ మొదలైంది.. వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి.. దాంతో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ కూడా తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు.. కొద్ది రోజుల క్రితం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లక్ష ఉద్యోగులను నియమించడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ క్రమంలో మీషో కూడా 5 లక్షల ఉద్యోగాలను నియమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
రాబోయే పండుగ సీజన్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మీషో ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మునుపటి సంవత్సరంలో కంపెనీ సృష్టించిన సీజనల్ జాబ్స్‌తో పోలిస్తే ఇది 50 శాతం పెరుగుదలను సూచిస్తుంది.. ఈకామ్ ఎక్స్‌ప్రెస్, డీటీడీసీ, ఎలాస్టిక్ రన్, లోడ్‌షేర్, డెలివరీ, షాడోఫ్యాక్స్, ఎక్స్‌ప్రెస్‌బీస్, వంటి మరిన్ని థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్‌లతో కొలాబరేషన్ ద్వారా దాదాపు 2 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించాలని మీషో భావిస్తోంది. ఈ అవకాశాలలో ఎక్కువగా 60 శాతం కంటే ఎక్కువ టైర్ 3, 4 ప్రాంతాలలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ జాబ్ రోల్స్‌లో డెలివరీ పికింగ్, సార్టింగ్, లోడ్ చేయడం, అన్‌లోడ్ చేయడం, రిటర్న్ ఇన్‌స్పెక్షన్స్ వంటివి ఉంటాయి.పండుగ సీజన్‌లో 3 లక్షల మందికి పైగా సీజనల్ వర్కర్స్‌ను నియమించుకుంటారు. ఈ టెంపరరీ, గిగ్ వర్కర్స్ మీషో సెల్లర్స్‌కు తయారీ, ప్యాకేజింగ్, సార్టింగ్‌తో సహా వివిధ సేవల్లో సపోర్ట్ చేస్తారు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
మీషోలో పండుగ సీజన్‌ను వేడుకల కంటే ఎక్కువగా చూస్తాం. ఇది పరివర్తన సమయం. మా కస్టమర్లు, విక్రేతలకు ఆనందం, సర్వీస్ అందించే సమయం. ఈ పండుగ సీజన్‌లో డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని ఎదురుచూస్తున్నాం. 5 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు మా విక్రేతలు, థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ భాగస్వాములను ఎనేబుల్ చేసినందుకు సంతోషిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.. అలాగే ఈ పండుగలో కస్టమర్ కు మరింతగా షాపింగ్ ను సులువు చేయడం కోసమే ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు తెలిపారు.. అలాగే చిన్న వ్యాపారాలు, కస్టమర్లకు సాధికారత కల్పించే దిశగా మీషో అడుగులు వేస్తోందన్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించాలి..
తాజావార్తలు
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!