తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యా విధానానికి స్వస్తి పలికి రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రకటించారు.
Minister Kishan Reddy: అంబర్‌పేట నియోజకవర్గం తులసీరాం నగర్ (లంక)లోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నోట్ బుక్స్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృక్పథంతో ఉన్నదని తెలిపారు. ఈ దిశగా పాఠశాలల్లో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, నోట్ బుక్స్, టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి…
New Education Policy: గత కొన్నేళ్లుగా విద్యావ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పటి వరకు చాలా వరకు డిగ్రీ కోర్సులు 3 సంవత్సరాల కాలవ్యవధి ఉండేవి. కానీ ఇప్పుడు కొత్త విద్యా విధానం 2020 (NEP 2020)ని అమలు చేయడానికి ఈ గ్రాడ్యుయేషన్ కోర్సుల వ్యవధి 4 సంవత్సరాలకు మారనుంది.
పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు కనీసం ఆరేళ్ల వయసు ఉండాలనే నిబంధనను పక్కాగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) ద్వారా దేశంలో తొలిసారిగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే విద్యా వ్యవస్థను రూపొందించడం జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
యూజీసీ పీహెచ్‌డీ అడ్మిషన్ల నిబంధనలను మార్చేసింది. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తిచేసిన వారికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పించేందుకు వీలుగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అడ్మిషన్ నిబంధనలను సవరించింది. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను కొనసాగించవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీష్ కుమార్ బుధవారం తెలిపారు.
దేశంలో విద్యావ్యవస్థ తీరుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యావిధానం పూర్తిగా ఏక పక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకువస్తున్న నూతన విద్యా విధానంపై రాష్ట్రాలతో సంప్రదించలేదని అన్నారు. తెలంగాణలో విద్యా విధానాన్ని మార్పు చేస్తామని అన్నారు. దేశంలో సెన్సేషన్ జరగాలి… జరుగుతుంది అని కేసీఆర్ అన్నారు. రాబోయే…
తెలంగాణలో విద్యా విధానంపై కొత్త చట్టం తీసుకురావాలని కేబినెట్ సమావేశం నిర్ణయించినట్టు తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ మరియు వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై.. కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.. Read Also:…
నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని.. ఈ విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీఎం కవైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో ఇవాళ నూతన విద్యావిధానంపై సమీక్ష నిర్వహించిన ఆయన.. నూతన విద్యా విధానంలో స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించాలని ఖరారు చేశారు.. స్టూడెంట్, టీచర్ రేష్యో పై తయారు చేసిన ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు.. శాటిలైట్ స్కూల్స్ ( పీపీ–1,…
నూతన విద్యా విధానంతో ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎంతో మేలు జరగుతుందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. నూతన విద్యా విధానంపై చర్చించారు.. నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించిన ఆయన.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.. ఇక, ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుందని.. మండలానికి…