ఈ ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఇంగ్లండ్ మరో గేమ్‌ను గెలుచుకుంది. టోర్నమెంట్‌లో ఇది వారికి రెండో విజయం మాత్రమే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్‌ను 37.2 ఓవర్లలోనే 179 పరుగులకే ఆలౌట్ చేసి 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి నేరుగా అర్హత సాధించేందుకు ఈ రెండు పాయింట్లు కూడా ఎంతో ముఖ్యం.
ప్రపంచకప్లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
వన్డే ప్రపంచకప్-2023లో ఆఫ్గానిస్తాన్ మరో విక్టరీ సాధించింది. లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 179 పరుగులు చేసింది. ఈ క్రమంలో 180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ షాహిదీ 56 నాటౌట్ పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రెహమత్ షా 52 పరుగులతో రాణించాడు.
ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్ జట్టు.. 179 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన చూపడంతో నెదర్లాండ్స్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసింది.
వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్ మరో సంచలన విజయం సాధించింది. ఇంతకుముందు సౌతాఫ్రికాను ఓడించి రికార్డ్ సాధించిన.. డచ్ జట్టు, తాజాగా బంగ్లాను ఓడించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 230 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 142 పరుగులకు ఆలౌట్ అయింది.
నెదర్లాండ్స్ 9 పరుగులకే ఆఖరి 5 వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని అందుకుంది. నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 310 పరుగుల భారీ తేడాతో కొత్త ప్రపంచకప్ రికార్డును నెలకొల్పింది.
2023 ప్రపంచకప్లో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ఆసీస్ విధ్వంసం సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
ప్రపంచకప్ 2023లో శ్రీలంక ఎట్టకేలకు తన ఖాతా ఓపెన్ చేసింది. లక్నోలో నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు ఈ మ్యాచ్లో నెదర్లాండ్ జట్టు గెలవడం కంటే మంచి ప్రదర్శన చూపించారు.
ప్రపంచకప్లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో భారత్.. మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లను సులువుగా ఓడించింది. అయితే జట్టు గెలుపుకు కావాల్సింది కేవలం బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. ఫీల్డింగ్ కూడా ముఖ్యం. అయితే ఆడిన మూడు మ్యాచ్ ల్లో టీమిండియా ఫీల్డర్లు క్యాచ్ లు పట్టడంలో అగ్రస్థానంలో ఉన్నారు. 93 శాతం క్యాచ్‌లను భారత ఫీల్డర్లు సద్వినియోగం చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో భారత్ తర్వాత నెదర్లాండ్స్ రెండో…